ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌ - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Sunday

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌

షారూక్‌..స‌ల్మాన్‌..హృతిక్‌..
దీప్తి...క‌త్రినా..క‌రీనా...
నాయ‌కీ, నాయ‌కులు ఎవ‌రైనా కావొచ్చు
కానీ స‌న్నివేశం, సంద‌ర్భానికి స‌రిపోయేలా..
వారి దుస్తులు డిజైన్ చేసేది మాత్రం
నిఫ్ట్ విద్యార్థులే...
అంతేకాదు...
క్యాట్ వాక్కులు...ర్యాంప్ షోలు
బ్రాండెడ్ దుస్తులు...అదిరే కాస్ట్యూమ్స్‌...
అన్ని మెరుపుల వెన‌కా...దాగి ఉన్నది నిఫ్ట్ సృజ‌నాత్మక‌తే...
ఎందుకంటే...
అదో ఫ్యాష‌న్ అడ్డా... ఫ్యాష‌నే అక్కడి విద్యార్థుల‌కు ప్యాష‌న్‌.. అదేవారి లైఫ్‌ యాంబిష‌న్‌
అందుకే... 
ఫ్యాష‌న్ ప్రపంచంలోకి అడుగెట్టాల‌నుకునే వారంతా నిఫ్ట్‌ల్లో చ‌ద‌వ‌డానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ఉంటేనే సీటు పొంద‌డం సాధ్యమ‌వుతుంది. పోటీ ఎక్కువ‌గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. ఇంత‌కీ అక్కడ ఏ కోర్సులు ఉన్నాయి, వాటికి అర్హత‌లేమిటి, ప్రవేశం ఎలా...త‌దిత‌ర‌ వివ‌రాలు క్షుణ్నంగా తెలుసుకుందామా...
కోర్సులు, అర్హత‌ల‌ వివరాలు ...
బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్స్‌: 
యాక్సెస‌రీ డిజైన్‌, ఫ్యాష‌న్ క‌మ్యూనికేష‌న్‌, ఫ్యాష‌న్ డిజైన్‌, నిట్‌వేర్ డిజైన్‌, లెద‌ర్ డిజైన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్‌
కోర్సు వ్య‌వ‌ధి: నాలుగేళ్లు
అర్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ
అపెర‌ల్ ప్రొడ‌క్షన్‌
కోర్సు వ్యవ‌ధి: నాలుగేళ్లు
అర్హ‌త‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్‌
కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌
కోర్సు వ్యవ‌ధి: రెండేళ్లు
అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి మూడేళ్ల డిప్లొమా
మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ
అర్హత‌: నిఫ్ట్ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లేదా ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు
ప్రవేశం: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా ల‌భిస్తుంది.
కోర్సుల వారీ సీట్లు ఇలా...
* అన్ని నిఫ్ట్‌ల్లోనూ క‌లిపి డిగ్రీ, పీజీ స్థాయుల్లో మొత్తం 2860 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
* బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్‌కు సంబంధించి ఫ్యాష‌న్ డిజైన్లో 420, లెద‌ర్ డిజైన్లో 120, యాక్సెస‌రీ డిజైన్ 420, టెక్స్‌టైల్ డిజైన్ 390, నిట్‌వేర్ డిజైన్ 210, ఫ్యాష‌న్ క‌మ్యూనికేష‌న్ 360 సీట్లు ఉన్నాయి.
* బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో అపెర‌ల్ ప్రొడ‌క్షన్ విభాగంలో 330 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
* పీజీ కోర్సులైన మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో 90, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌లో 420, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో 100 సీట్లు ఉన్నాయి.
నిఫ్ట్ సంస్థలు ఇక్కడ‌
దేశ‌వ్యాప్తంగా 15 నిఫ్ట్ సంస్థలున్నాయి. వాటిని బెంగ‌ళూరు, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, చెన్నై, కోల్‌క‌తా, న్యూఢిల్లీ, ముంబై, గాంధీన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, ప‌ట్నా, క‌న్నూరు, రాయ్‌బ‌రేలీ, షిల్లాంగ్‌, కంగ్రా, జోధ్‌పూర్‌ల్లో ఏర్పాటు చేశారు .
రాత ప‌రీక్ష ఇలా...
ఒక్కో కోర్సుకు ప్రశ్నప‌త్రం ఒక్కో విధంగా ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. ప్రతి స‌రైన‌ స‌మాధానానికీ ఒక మార్కు.
బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్‌, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జ‌న‌ర‌ల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.
ప‌రీక్షలో: క్వాంటిటేటివ్ ఎబిలిటీ, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నల‌డుగుతారు. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, క‌మ్యూనికేటివ్ ఎబిలిటీ నుంచి 35, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 30, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ 30, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.
బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (ఎంఎఫ్‌టెక్‌) కోర్సుల్లో ప్రవేశానికి ప్రశ్నప‌త్రం ఒకే మాదిరిగా ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. వీటిని మూడు గంట‌ల్లో పూర్తిచేయాలి.
ప‌రీక్షలో: క‌్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 30, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 45, ఎన‌లిటిక‌ల్ అండ్ లాజిక‌ల్ ఎబిలిటీ నుంచి 25, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్ స్టడీకి 25 మార్కులు కేటాయించారు.
మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రత్యేక ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు. మొత్తం 150 ప్రశ్నల‌డుగుతారు. వ్యవ‌ధి 3 గంట‌లు.
ప‌రీక్షలో: క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 10, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50, ఎన‌లిటిక‌ల్ అండ్ లాజిక‌ల్ ఎబిలిటీ 25, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ 25, కేస్ స్టడీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
విభాగాల వారీ ఈ అంశాల నుంచి ప్రశ్నలు
క్వాంటిటేటివ్ ఎబిలిటీ
కూడిక‌లు, గుణింతాలు, భాగాహారం, తీసివేత‌లు, శాతాలు, భిన్నాలు, వ‌డ్డీ రేట్లు, ప‌ని -కాలం, దూరం-వేగం, నిష్పత్తి, స‌గ‌టు..త‌దిత‌ర అంశాల‌పై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల స్థాయి మ‌రీ అంత క‌ఠినంగా ఉండ‌దు. హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల నుంచి ఈ అంశాల‌న్నీ క‌వ‌ర్ అయ్యేలా చ‌దువుకుంటే స‌రిపోతుంది. వీలైతే ఆర్ ఎస్ అగ‌ర్వాల్‌ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ రెండు పుస్తకాల్లో దేన్నైనా తీసుకుని న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ విభాగాన్ని చదువుకుంటే స‌రిపోతుంది.
క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ
అభ్యర్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ప‌రీక్షిస్తారు. రోజువారీ జీవితంలో మాట్లాడ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌ద‌సంప‌ద‌, వ్యాక‌ర‌ణం ఉన్నాయో, లేదో ప‌రీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నల‌డుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. వ్యాక‌ర‌ణ ప్రాథ‌మిక నియ‌మాలు, ప్రాథ‌మిక స్థాయి ప‌ద‌సంప‌ద పరిజ్ఞానం ఉండాలి. స‌మానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెత‌లు, నుడికారాలు, సింగిల‌ర్‌, ప్లూర‌ల్‌, వ‌న్ వ‌ర్డ్ స‌బ్‌స్టిట్యూట్స్‌, స్పెల్లింగ్ క‌రెక్షన్ త‌దిత‌ర విభాగాల్లో ప్రశ్నల‌డుగుతారు.
ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ
అభ్యర్థి త‌ర్కాన్ని పరీక్షించ‌డానికి ఈ సెక్షన్‌ను కేటాయించారు. కొంత స‌మాచారం ఇచ్చి దాన్నుంచే జ‌వాబులు రాబ‌ట్టే ప్రశ్నలు అడుగుతారు. ఈ సెక్షన్ ద్వారా అభ్యర్థి ఆలోచ‌నా స్థాయిని కూడా ప‌రీక్షిస్తారు. ఇచ్చిన స‌మాచారాన్ని బాగా విశ్లేషించ‌గ‌లిగితే స‌మాధానం గుర్తించ‌డం సులువ‌వుతుంది. గ‌ణితంలో ప‌రిజ్ఞానం ఈ సెక్షన్ ప్రశ్నల‌కు స‌మాధానాలు రాబ‌ట్టడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్‌
వ‌ర్తమాన అంశాల‌పై ప్రశ్నల‌డుగుతారు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో అభ్యర్థికి స‌మాజం, ప‌రిస‌రాల‌పై ఉన్న అవ‌గాహ‌న‌ను ప‌రిశీలిస్తారు. తాజా ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ఉంటే క‌రెంట్ అఫైర్స్ ప్రశ్నల‌కు సులువుగానే స‌మాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా ప‌త్రిక చ‌దివి ముఖ్యాంశాల‌ను నోట్సురూపంలో రాసుకుంటే సులువుగా గుర్తుపెట్టుకోవ‌చ్చు.

క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్‌
అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజ‌నాత్మక‌త ఎలా ఉందో ఈ ప‌రీక్ష ద్వారా ప‌రిశీలిస్తారు. రంగుల‌ను ఎలా ఉప‌యోగిస్తున్నారు, ప‌రిశీల‌నాశ‌క్తి ఏ విధంగా ఉంది, కొత్తద‌నం ఏమైనా ఉందా, ఇల‌స్ట్రేష‌న్‌, క‌ళాత్మక నైపుణ్యం..త‌దిత‌ర అంశాల మేళ‌వింపుతో ఈ ప‌రీక్ష ఉంటుంది.
కేస్ స్టడీ: ఈ విభాగంలో ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అంశం గురించి స‌మాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజీరియ‌ల్ నైపుణ్యం ప‌రిశీలిస్తారు.
మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ ప్రశ్నప‌త్రంలో కొన్ని ప్రశ్నలు ఇంజినీరింగ్ విభాగం నుంచి అడుగుతారు.
రాత ప‌రీక్షలో అర్హత సాధించిన‌వాళ్లకు వారు ఎంపిక చేసుకున్న కోర్సును బ‌ట్టి సిట్యువేష‌న్ టెస్ట్‌, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.
గ్రూప్ డిస్కష‌న్ ఇలా..
ఏదైనా ఒక కేస్ స్టడీ ఇచ్చి దానిపై 15 నుంచి 20 నిమిషాలు చ‌ర్చించ‌మంటారు. అభ్యర్థులు చ‌ర్చిస్తున్నప్పుడు నిర్ణేత‌లు ఆ కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత‌, ఆ అంశంపై ఉన్న ప‌రిజ్ఞానం, ఆ అంశంపై అభ్యర్థి స‌మావేశంలో ఎంత వ‌ర‌కు భాగ‌స్వామి అయ్యాడు, ఇంట‌ర్ ప‌ర్సన‌ల్ స్కిల్స్, కొత్త ఆలోచ‌న‌లు ఏమైనా పంచుకున్నారా, స‌మ‌స్య ప‌రిష్కార దిశ‌గా ఎలా స్పందిస్తున్నారు, నాయ‌క‌త్వ లక్షణాలు, భావాలు పంచుకున్న తీరు, భావాల్లో ప‌రిణ‌తి, భాష‌లో స్పష్టత‌...ఇలా ప‌లు కోణాల్లో అభ్యర్థిని ప‌రిశీలిస్తారు.
ఇంట‌ర్వ్యూలో...
అభ్యర్థికి ఫ్యాష‌న్ కెరీర్‌పై ఏమేర‌కు ఆస‌క్తి ఉంది? ఈ రంగంపై ప‌రిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? అక‌డ‌మిక్ ప్రతిభ‌, కో క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌, క‌మ్యూనికేష‌న్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ ఆప్టిట్యూడ్‌, క్రియేటివిటీ, లేట‌ర‌ల్ థింకింగ్‌..త‌దిత‌ర కోణాల్లో ప‌రిశీలిస్తారు.
ఇంట‌ర్వ్యూలోనూ అర్హత సాధిస్తే చివ‌రిగా ప్రవేశం ల‌భిస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న ప్రాధాన్యం ప్రకారం మెరిట్ ప్రాతిప‌దిక‌న ఏదైనా నిఫ్ట్‌లో సీటు కేటాయిస్తారు. కోర్సుల‌కు ఎంపికైన‌వారికి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యారుణాన్ని మంజూరుచేస్తుంది. ఈ మేర‌కు నిఫ్ట్ సంస్థలు యూబీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
విదేశాల్లోనూ అవ‌కాశం
నిఫ్ట్ విద్యార్థులు కావాల‌నుకుంటే అమెరికాలోనూ చ‌దువుకోవ‌చ్చు. దీనికోసం న్యూయార్క్‌లోని ఫ్యాష‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఫిట్‌)తో నిఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు నిఫ్ట్‌లో రెండేళ్లు చ‌దివిన త‌ర్వాత‌ ఫిట్‌లో ఏడాది పాటు విద్యన‌భ్యసించాలి. అనంత‌రం నిఫ్ట్‌లో చ‌దువుకోవాలి. కోర్సు పూర్తయిన వెంట‌నే నిఫ్ట్‌, ఫిట్ రెండు సంస్థలూ డిగ్రీని ప్రదానం చేస్తాయి. అంటే ఏక కాలంలో డ్యూయ‌ల్ డిగ్రీని అందుకోవ‌చ్చన్నమాట‌.
వీటిపై అవ‌గాహ‌న త‌ప్పనిస‌రి
ఫ్యాష‌న్ ప్రపంచంలోకి అడుగెట్టాలంటే సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవ‌హారాలు, రంగులు, ట్రెండ్‌, ఫ్యాబ్రిక్‌..వీట‌న్నింటిపైనా అవ‌గాహ‌న పెంచుకోవాలి. కేవ‌లం సృజ‌న ఉన్నంత‌మాత్రాన స‌రిపోదు. ఆలోచ‌న‌లకు సంబంధించిన‌ ఊహా చిత్రాన్ని చేతితో గీయ‌డం, కంప్యూట‌ర్‌లో దానికి రూపాన్నివ్వడం ఈ రెండింటిలో దేన్నైనా తెలుసుకోవాలి. ఫ్యాష‌న్‌, డిజైన్ రెండింటి మ‌ధ్య తేడాలు తెలుసుకోవాలి. అలాగే ఈ రెండింటి మ‌ధ్య సారుప్యత గురించీ అవ‌గాహ‌న ఉండాలి.
కొత్త ట్రెండ్‌
ప్రస్తుతం క‌మ్యూనికేష‌న్ డిజైన్ భార‌త్‌లోనూ విస్త‌రిస్తోంది. డిజైన‌ర్లు త‌యారుచేసిన దుస్తుల‌పై కంపెనీల లోగోలు, ఆక‌ట్టుకునే క్యాప్షన్లు వేసే ప‌నిని వీరు చేస్తారు. కంప్యూట‌ర్‌లో లోగో లేదా కొటేష‌న్‌, సీన‌రీ..ఇలా దేన్నైనా డిజైన్ చేసి త‌యారుచేసిన దుస్తుల‌పై ఉంచుతారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ లోగో సంస్కృతి మ‌న ద‌గ్గ‌రా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆక‌ర్షణీయంగా క‌నిపించాల‌నే త‌ప‌న యువ‌త‌తోపాటు పెద్దవారిలోనూ పెరుగుతోంది. ఇలా క‌నిపించ‌డంలో దుస్తుల పాత్రే కీల‌కం. అందుకే డ‌బ్బు విష‌యంలో వెనుకాడ‌కుండా ఫ్యాష‌న్ ప్రపంచంవైపు జ‌నాలు ప‌రుగులు తీస్తున్నారు. కాబ‌ట్టి ఆక‌ట్టుకునేలా దుస్తుల‌ను కొత్తగా డిజైన్ చేయ‌గ‌లిగే విద్య అబ్బిందంటే ల‌క్షల్లో సంపాదించ‌డం సులువైన‌ట్టే. ఫ్యాష‌న్ విద్యార్థులు అసోసియేష‌న్ ఆఫ్ డిజైన‌ర్స్ ఆఫ్ ఇండియా (ఏడీఐ) గ్రూప్‌లో చేర‌డం ద్వారా అవ‌కాశాలు, తాజా ప‌రిణామాల‌ను అందిపుచ్చుకోవ‌చ్చు. కోర్సులు విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న త‌ర్వాత ఫ్యాష‌న్ మీడియా, డిజైన‌ర్‌, స్టైలిస్ట్ (స్టోర్స్‌), ఫ్యాష‌న్ రిటైల‌ర్‌, ఫ్యాష‌న్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌, ప‌ర్సన‌ల్ స్టైలిస్ట్‌/ సెలెబ్రిటీ స్టైలిస్ట్ త‌దిత‌ర హోదాల‌తో రాణించ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 29.12.2017.
రూ.5000 ఆలస్య రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.01.2018.
ప్రవేశ ప‌రీక్ష తేది: 21.01.2018.
NotificationOnline ApplicationWebsite

Pages