ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంజినీరింగ్ - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్



పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!



కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Sunday

ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంజినీరింగ్

ఇంజినీరింగ్‌కు ఇతర మార్గాలు
ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితుల కారణంగా కొందరు ఇంజినీరింగ్ కోర్సులో చేరలేకపోవచ్చు. మరికొందరు ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసినా అనుకున్న ర్యాంక్ లభించక ఇంజినీరింగ్‌లో ప్రవేశించలేకపోవచ్చు. అంతమాత్రాన ఇంజినీరింగ్ కెరీర్‌కు దూరం కావాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైన గుర్తింపు ఉన్న కోర్సులను ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వంటి సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో చేరడం ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీ చేసినట్లు అవుతుంది.
ఇంజినీరింగ్ వృత్తిలో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి పలు సంస్థలు విలువైన, ఉన్నతమైన ఇంజినీరింగ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి...
1) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా).
2) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీిఈ)
3) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా)
4) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్
   ఇంజినీరింగ్ రంగంలో నిపుణులైన సాంకేతిక సిబ్బందిని అందించాలనే లక్ష్యంతో 1914లో భారత్‌లో మొదటిసారిగా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా - ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. రెగ్యులర్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరలేకపోయినవారికి, వివిధ సాంకేతిక వృత్తుల్లో చేరి భవిష్యత్తు కోసం ఇంజినీరింగ్ డిగ్రీ సాధించాలని తపించేవారికి ఈ సంస్థ అండగా నిలుస్తోంది. కాలక్రమేణ విద్యార్థుల ఆదరణ, డిమాండ్ పెరిగేకొద్దీ 1920లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఏర్పడింది. తర్వాత కాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంటి పలు సంస్థలు ఆవిర్భవించాయి.
అర్హతలు
   సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సు చేయాలంటే ఎంసెట్ లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షలు రాయాలి. ఈ సంస్థలు అందించే ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుకు ఇవేమీ అవసరంలేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్థులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో సగటున 45 శాతం మార్కులు అవసరం.
ప్రవేశ విధానంఈ సంస్థల్లో ప్రవేశానికి విద్యార్థులు మొదట మెంబర్‌షిప్ పొందాలి. దీనికోసం తమ పేరును నమోదు చేసుకోవాలి. అర్హతలను పరిశీలించిన తర్వాతే వీరికి మెంబర్‌షిప్ ఇస్తారు. అక్కడి నుంచి కెరీర్ ప్రారంభమైనట్లు భావించాలి. వయసు 17 ఏళ్లు నిండాలి.
డిగ్రీ ఎలా ఇస్తారు?
ఈ సంస్థలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరు మాసాల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తాయి. జూన్‌లో పరీక్షలు రాయాలంటే సెప్టెంబరు/ అక్టోబరులో మెంబర్‌షిప్ పొందాలి. డిసెంబరులో పరీక్షలు రాయాలంటే ఏప్రిల్/మేలో మెంబర్‌షిప్ పొందాలి. తర్వాత ఒక్కోవిభాగాన్ని సంస్థ సూచించిన కాలంలోగా పూర్తిచేయాలి. విద్యార్థులు అన్ని పేపర్లలో ఆయా సంస్థలు నిర్ణయించిన మార్కులను సాధించాలి. అదే సమయంలో ప్రాక్టికల్స్‌లో తప్పకుండా ఉత్తీర్ణులు కావాలి. అప్పుడే వారికి 'అసోసియేటెడ్ మెంబర్‌షిప్' హోదా లభిస్తుంది. సకాలంలో అన్ని పరీక్షలు పూర్తిచేసిన వారికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
అవసరమైనప్పుడు శిక్షణ: సహజంగా శిక్షణ అంతా దూర విద్యా విధానంలోనే ఉంటుంది. సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను విద్యార్థులకు సూచిస్తారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. దీనికోసం కొంత స్వల్ప మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంది.
ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
ఆధునిక జీవనశైలిలో అంతర్భాగమైన ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో నిపుణులకు నిత్యం డిమాండ్ ఉంటోంది. సమర్ధులైన నిపుణులు ఉంటేనే ఈ రంగం సరైన ప్రతిఫలాలను అందించగలదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) పారిశ్రామిక రంగానికి, సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా నిపుణులకు తర్ఫీదునివ్వడంలో కృషి చేస్తోంది. 1953 లో ఏర్పాటైన ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్ రంగాల్లో కొత్తగా ఆవిష్కృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చేర్చడంలో, సమర్థులుగా వారిని తీర్చి దిద్దడంలో కృషి చేస్తోంది. కరస్పాండెన్స్ విధానంలో బోధన ఉంటుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ కోర్సులను మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రాంతీయ కార్యాలయాన్ని 1973లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న ప్రోగ్రాములు..
1) డిప్లొమా ఇన్ ఐఈటీఈ
2) ఏఎంఐఈటీఈ (బీటెక్ డిగ్రీతో సమానం)
ప్రవేశం: 
మొదట మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఇది 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత అర్హులైన వారికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
1) డిప్లొమా ఇన్ ఐఈటీఈ: ఈ కోర్సు చేయడానికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ డిప్లొమా పొందినవారు ఐఈటీఈ అందించే అసోసియేట్ మెంబర్ కోర్సులో ప్రవేశానికి అర్హులవుతారు.
2) ఏఎంఐఈటీఈ: అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ - ఏఎంఐఈటీఈ పూర్తి రూపం. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులు లేదా డిప్లొమా ఇన్ ఐఈటీఈ ఉండాలి.
ఇది గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇందులో ఎ, బి సెక్షన్లుంటాయి.సెక్షన్-ఎలోని అన్ని సబ్జెక్టులను ఒకేసారి పూర్తి చేయాలి. తర్వాత సెక్షన్ - బి రాయవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో ఉత్తీర్ణులైనా ప్రాక్టికల్స్‌లో కూడా పాస్ కావాలి. తర్వాతే ఏఎంఐఈటీఈ సర్టిఫికెట్ ఇస్తారు.
వెబ్‌సైట్: http://www.iete.org
ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్
పారిశ్రామిక మార్కెట్లో మెకానికల్ ఇంజినీర్ల డిమాండ్‌ను గమనించడంతోపాటు, ఆధునిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో 1914 లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా) ఏర్పడింది. ఈ సంస్థ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కోర్సును నిర్వహిస్తోంది. దీన్ని టెక్నికల్ ఇంజినీరింగ్ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థ రెండు రకాలైన మెంబర్‌షిప్‌లను అందిస్తోంది. సంవత్సరానికి రెండుసార్లు జూన్, డిసెంబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
మెంబర్‌షిప్‌ల వివరాలు ...
* స్టూడెంట్ మెంబర్‌షిప్ (డిప్లొమాతో సమానం): ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనిలో సెక్షన్-ఎ, సెక్షన్-బి విభాగాలు ఉంటాయి. సబ్జెక్టుల్లో మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ మొదలైనవి ఉన్నాయి. రెండు సెక్షన్‌లలో అర్హత పొందితే అసోసియేట్ మెంబర్‌షిప్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
* అసోసియేట్ మెంబర్‌షిప్: దీన్నే డిగ్రీ లెవెల్ ఎగ్జామినేషన్ అని కూడా పిలుస్తారు. స్టూడెంట్ మెంబర్‌షిప్ అర్హతతో పాటు వయసు 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ మెంబర్‌షిప్ ఇస్తారు.
ఇక్కడకూడా సెక్షన్-ఎ,సెక్షన్-బి విభాగాలు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో అర్హత సాధించడంతోపాటు ప్రాజెక్టు రిపోర్టు సకాలంలో పూర్తిచేసినవారికి 'అసోసియేట్ మెంబర్‌షిప్' లభిస్తుంది.
వెబ్‌సైట్: www.imeindia.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్
ఇంజినీరింగ్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెటలర్జికల్ ఇంజినీరింగ్ నిపుణులను తీర్చిదిద్దడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ కృషి చేస్తోంది. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ సంస్థ అందించే ఇంజినీరింగ్ డిగ్రీ, రెగ్యులర్ విధానంలో దేశ, విదేశీ యూనివర్సిటీలు నిర్వహించే మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైందిగా గుర్తింపు పొందింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరవచ్చు.
వెబ్‌సైట్: www.iim-india.netఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)
దేశ సాంకేతిక అవసరాలకు తగిన విధంగా ప్రతిభావంతులైన ఇంజినీర్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థే 'ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్'. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే సమర్థులైన ఇంజినీర్లను అందించేందుకు కృషి చేస్తున్న ఈ సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దేశం సాంకేతికంగా పురోభివృద్ధి చెందాలంటే ఇంజినీరింగ్ నిపుణుల కొరత నివారించాలని ఇండస్ట్రియల్ కమిషన్ 1916లో సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగా 1920లో కోల్‌కతాకు చెందిన థామస్ హాలెండ్ కృషి చేశారు. ఫలితంగా 1920లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) రూపుదాల్చింది. సంస్థ సభ్యులను 'ఛార్టర్ ఇంజినీర్‌'గా పిలుస్తారు. ఈ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 103 బ్రాంచీలున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ముఖ్య సమాచార కేంద్రం ఉంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కడప, కాకినాడ పట్టణాల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి.
అందిస్తున్న డిగ్రీ: ఏఎంఐఈ (అసోసియేట్ మెంబర్‌షిప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్). ఈ డిగ్రీ నాన్-ఫార్మల్ విధానంలో ఇంజినీరింగ్ డిగ్రీతో సమానం. మొత్తం 14 బ్రాంచీల్లో ఏఎంఐఈని అందిస్తోంది. అవి...1) మెకానికల్
2) ఎలక్ట్రికల్
3) సివిల్
4) మెటలర్జీ
5) కెమికల్
6) ఆర్కిటెక్చర్
7) టెలికమ్యూనికేషన్స్
8) టెక్స్‌టైల్స్
9) అగ్రికల్చర్
10) కంప్యూటర్స్
11) ఏరోస్పేస్
12) ప్రొడక్షన్
13) మెరైన్
14) ఎన్విరాన్‌మెంటల్.
టెక్నీషియన్ మెంబర్‌తో కెరీర్ ప్రారంభం: సంస్థలో మొదట మెంబర్‌షిప్ పొందిన వారిని 'టెక్నీషియన్ మెంబర్ పేరుతో పిలుస్తారు. కోర్సు విధానం: ఇందులో సెక్షన్-ఎ, సెక్షన్-బి ఉంటాయి.
సెక్షన్ - ఎ: దీనికి నాన్ -డిప్లొమా, డిప్లొమా విద్యార్థులు అర్హులు. నాన్- డిప్లొమా విభాగానికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి. డిప్లొమా విభాగానికి పాలిటెక్నిక్ తత్సమాన డిప్లొమా అవసరం. వయసు 18 సంవత్సరాలు ఉండాలి.
సెక్షన్-ఎలో 10 సబ్జెక్టులుంటాయి. ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు రావాలి. తర్వాత గైడ్ పర్యవేక్షణలో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. దీనికోసం ఇన్‌స్టిట్యూషన్ గుర్తించిన వారిలో ఒకరిని రిఫరీగా ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి ప్రతివారం రిఫరీ పర్యవేక్షణలో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు వర్కును పూరిచేయాలి. తర్వాత సెక్షన్-బి రాసేందుకు అనుమతి లభిస్తుంది.
పరీక్ష విధానం కఠినతరం: ఈ సంస్థ నిర్వహించే పరీక్షల నిర్వహణ విధానం సాధారణ పరీక్షల మాదిరి ఉండదు. అకడమిక్ సబ్జెక్టు నిపుణులతోపాటు ఇండస్ట్రీ నిపుణులు కూడా సహకరిస్తారు. వీరు ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ప్రతి సబ్జెక్టు మీద ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. తర్వాత వీటిని కంప్యూటర్లో ఫీడ్ చేసి ర్యాండమ్‌గా వచ్చిన ప్రశ్నలతో చివరి ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.సెక్షన్-బి: ఇందులో అభ్యర్థి తనకు నచ్చిన పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ కాలేజీల్లో మాదిరి కోర్సులో చేరేటప్పుడే బ్రాంచీలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరంలేదు. సెక్షన్-ఎ పూర్తి చేసిన తర్వాత జాబ్ మార్కెట్లో ఏ బ్రాంచీకి ఎక్కువ డిమాండ్ లభిస్తోందో దానికి తగిన విధంగా బ్రాంచీని ఎంపిక చేసుకోవచ్చు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు 'గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్' (ఇండియా) సర్టిఫికెట్ 'ప్రదానం చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు
వెబ్‌సైట్: www.ieindia.org
చక్కటి భవిష్యత్తు
ఆర్థిక స్థోమత లేక ఇంజినీరింగ్ చేయలేకపోయిన వారికి ఏఎంఐఈ చక్కటి భవిష్యత్తుకు ఊతమిస్తోంది. అంతేకాదు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేసి వివిధ సాంకేతిక రంగాల్లో స్థిరపడి తిరిగి ఇంజినీరింగ్ చదవాలనే వారికి కూడా ఈ కోర్సు ఎంతో ఉపయోగకరం. వర్కింగ్ ఇంజినీర్లు తమ వృత్తిలో అభివృద్ధి చెందడానికి ఈ కోర్సు ఒక ప్రధాన అర్హతగా నిలుస్తోంది. ఇంటర్ పూర్తి చేసినవారు కూడా రెగ్యులర్ ఇంజినీరింగ్‌కాలేజీలో ఇంజినీరింగ్ చేరలేకపోయినా, ఏఎంఐఈ చదివితే వీరుకూడా రెగ్యులర్ బీఈ/ బీటెక్ చేసినట్లే. కాబట్టి విద్యార్థులు ఉన్నత విద్యార్జనకు, ప్రస్తుతం ఇంజినీరింగ్ సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నత స్థితికి ఏఎంఐఈ చేయడం మంచిదే.
- జి.సుధాకర్, ఛైర్మన్ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా),హైదరాబాద్
బీఈ, బీటెక్‌తో సమాన గుర్తింపుఇంజినీరింగ్ కోర్సులను రెగ్యులర్‌గా చేస్తేనే కాదు ఈ సంస్థలు నిర్వహిస్తున్న డిగ్రీలకు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉంది. రోజువారీ క్లాసులు లేకపోయినా, ప్రాక్టికల్స్ విషయంలో ఏమాత్రం వెనక్కుతగ్గని ఈ సంస్థలు అందిస్తున్న ఇంజినీరింగ్ డిగ్రీకి మంచి గుర్తింపు ఉంది. ఈ కోర్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు దేశంలోని అన్ని రకాల యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలుగుర్తించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే ఏదైనా ఇంజినీరింగ్ రంగంలో ఉంటే పదోన్నతులకు, ఇతర ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.

Pages