ఎంబీఏ పూర్తిచేశాను? - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Friday

ఎంబీఏ పూర్తిచేశాను?

ఎంబీఏ పూర్తిచేశాను. ప్రస్తుతం ఓ సంస్థలో మేనేజర్‌గా చేస్తున్నాను. న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీపై కోర్సులు చేయాలని ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థలేవి? - గౌరీమోహన్‌ పాణిగ్రాహి

తెలుగు రాష్ట్రాల్లో న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీపై కోర్సులు అందుబాటులో లేవు. మీరు మేనేజర్‌గా చేస్తున్నారు కాబట్టి, దూరవిద్య ద్వారా ఈ కోర్సును టెరీ యూనివర్సిటీ ద్వారా చేసే అవకాశముంది. కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ లాంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు చేయవచ్చు.
ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఎంటెక్‌ స్థాయిలో ఒకటి/ రెండు సబ్జెక్టులుగానే బోధిస్తున్నారు కానీ ప్రత్యేకించి ఒక కోర్సుగా అందుబాటులోకి రాలేదు. దీనిని ఒక కోర్సులా కాకుండా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీకి సంబంధించిన 14 రకాల శిక్షణ సంస్థలో స్వల్పకాలిక శిక్షణ పొందవచ్చు. పూర్తి వివరాలకు టెరీ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీస్‌ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

ఎంబీఏ చేశాను. మనో విజ్ఞానశాస్త్రం (సైకాలజీ)పై ఆసక్తి ఉంది. దూరవిద్య ద్వారా చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా? అందించే విశ్వవిద్యాలయాలేవి? - బి.వి. రామలక్ష్మి

ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు సైకాలజీలో పీజీ చేయడానికి అర్హులు. దూరవిద్యలో దీన్ని అభ్యసించే అవకాశముంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు; ఎస్‌వీ యూనివర్సిటీ, తిరుపతి; ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం; ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సంస్థలు సైకాలజీలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ స్పెషలైజేషన్‌ చేసివుంటే ఈ కోర్సు మీకు మరింత అవగాహన పెంచుకోవడంలో తోడ్పడుతుంది.

ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేశాను. అదనంగా కోర్సులు చేద్దామనుకుంటున్నాను. ఏవి మేలు? - కె. అశ్విని

ముందుగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. మీకు ఫైనాన్స్‌ రంగంలోని స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీవైపు మొగ్గు ఉంటే నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) వారు అందిస్తున్న ఎన్‌సీఎఫ్‌ఎం కోర్సులను ఎంచుకుని, పూర్తిచేయవచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే డిప్లొమా లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.
మార్కెటింగ్‌లో అయితే.. డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. అంకెలు, సమస్య సాధన, మేథమేటిక్స్‌లో చురుకుదనం ఉంటే అనలిటిక్స్‌ కోర్సులను ఎంచుకుని ఆర్‌ పైథాన్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఎంచుకోవచ్చు.
మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని, తరువాత మీకు ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోండి. వివిధ MOOC's(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) కోసం edx.org, courseera.com వెబ్‌సైట్లను సందర్శించండి.

ఎంబీఏ పూర్తిచేశాను. ఉద్యోగావకాశాల కోసం చూస్తున్నాను. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇంకా ఏవైనా కోర్సులు చేస్తే మేలా?

ఎంబీఏ ఏ స్పెషలైజేషన్‌తో పూర్తిచేశారో తెలియజేయలేదు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూడటం కాకుండా ప్రయత్నం చేయండి. సాధారణంగా ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలరు. ముందు మీరు ఏ రంగంలో ఉద్యోగాన్ని సాధించదలిచారో నిర్ణయించుకోండి. తరువాత సాఫ్ట్‌స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, బృందంతో పనిచేయడం, ఇంటర్వ్యూల కోసం సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటివి చేయండి. ఇక ఏవైనా కోర్సులు చేయాలనుకుంటే.. మీరు చదివిన స్పెషలైజేషన్లలో యాడ్‌ఆన్‌ కోర్సును ఎంచుకోండి. ప్రస్తుతం కంప్యూటర్‌ పరిజ్ఞానం ముఖ్యం కాబట్టి, ఎంఎస్‌ ఆఫీస్‌తోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే మీ రెజ్యుమేను జాబ్‌ పోర్టళ్లలో అప్‌లోడ్‌ చేసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభించండి, తప్పక విజయం సాధిస్తారు.

మా అబ్బాయి బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదువుతున్నాడు. ఎంబీఏ, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఏ ఉన్నతవిద్య చదివితే తన భవిష్యత్తు బాగుంటుంది? స్వదేశ, విదేశాల్లో తనకున్న అవకాశాలను తెలపండి.

మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్స్‌ రెండు కోర్సులకూ తమదైన ప్రత్యేకత ఉంది. రెండూ మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. మీ అబ్బాయిలో బృందనైపుణ్యాలు, సమస్య పరిష్కరించగల నైపుణ్యం, సవాళ్లను ఎదుర్కునే మనస్తత్వం, వ్యాపారాలోచనలు, నెట్‌వర్కింగ్‌ నేర్పు ఉంటే ఎంబీఏను ఎంచుకోవచ్చు. మనదేశంలో ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్‌ రాసి, ఐఐఎంలు, మంచి బిజినెస్‌ స్కూళ్లలో విద్యావకాశాన్ని పొందవచ్చు. కోడింగ్‌, కంప్యూటర్స్‌ పట్ల ఆసక్తి, మేథమేటిక్స్‌పై అభిరుచి ఉంటే కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ను ఎంచుకోవచ్చు. మనదేశంలో ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీజీ కంప్యూటర్‌ కోర్సును ఎంచుకోవచ్చు. విదేశాల్లో విద్యనభ్యసించాలంటే జీఆర్‌ఈ/ జీమ్యాట్‌తోపాటు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈల్లో మంచి స్కోరుతో మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని పొందవచ్చు. రెండు కోర్సులూ మంచి భవిష్యత్తును అందించే సాధనాలే. మీ అబ్బాయి అభిరుచి, ఆర్థికస్థోమత పరంగా నిర్ణయాన్ని తీసుకోండి.

దూరవిద్య ద్వారా బీకాం చేసి, ఎంబీఏ (2008) రెగ్యులర్‌ విధానంలో పూర్తిచేశాను. కానీ, నేను ఇంటర్మీడియట్‌ చదవలేదు. ఎల్‌ఎల్‌బీ చేయాలనుంది. నాకు రెగ్యులర్‌ విధానంలో చేసే వీలుందా?

మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ చేయదలచిన అభ్యర్థులు ఏపీ లాసెట్‌ లేదా తెలంగాణ లాసెట్‌ నిబంధనల ప్రకారం 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ 45% మార్కులతో పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. క్లాట్‌ ద్వారా ఎల్‌ఎల్‌బీ చేయాలనుకుంటే 10+2 పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. గరిష్ఠ వయఃపరిమితి జనరల్‌ వారికి 20 ఏళ్లు, రిజర్వ్‌డ్‌ వారికి 22 ఏళ్లు. మీరు ఇంటర్‌ పూర్తిచేయలేదు కాబట్టి, ప్రస్తుతం మీకు ఎల్‌ఎల్‌బీ అభ్యసించడానికి అర్హత లేదు.

ఎంబీఏ పూర్తిచేసి, ఖాళీగా ఉంటున్నాను. ఇంట్లో ఉండి పని (వర్క్‌ ఫ్రం హోం) చేసుకుని, ఆదాయం పొందే సలహా చెప్పగలరు.

ఎంబీఏ పూర్తిచేసిన మీరు ఇంట్లో ఉండి, ఏదో ఒక పని చేయడం కంటే మీ చదువుకు తగిన ఉద్యోగాన్ని సంసాదించడానికి ప్రయత్నించండి.
మీకు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటే, కొనసాగించండి. ఒకటి, రెండు అవకాశాలు కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన పనిలేదు. పట్టుదలతో ప్రయత్నించండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఉన్నత చదువులు చదవలేని పరిస్థితిలో ఉంటే.. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వర్క్‌ ఫ్రం హోం అవకాశాలను కల్పిస్తున్నాయి. వాటికి దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు స్టైపెండ్‌ కూడా పొందవచ్చు.

* ఎంబీఏ చదువుతున్నాను. బహుళజాతి సంస్థల్లో పనిచేయడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమని విన్నాను. అవేమిటి? వాటినెలా పెంచుకోవాలి?

ఎంబీఏ చదివినవారు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, మార్పును స్వీకరించే సామర్థ్యం, పర్యవేక్షక నైపుణ్యాలు, పరస్పర సంబంధాలు, చర్చించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, విశ్లేషణాత్మక అభిప్రాయం, వృత్తినైపుణ్యం, సమయ వినియోగం, బృందంతో కలిసి పనిచేయడం, వ్యూహాత్మక ఆలోచన మొదలైనవి ఉండాలి.
ఇంకా వివిధ దేశాలకు చెందినవారితో పనిచేయాల్సివుంటుంది. అందుకే ఇతర భాషలను మాట్లాడటం, భిన్న దేశాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడం అవసరం. ఎంబీఏ చదువుతున్నపుడు వివిధ నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అధ్యాపకుల, నిపుణుల సలహాలను తీసుకోవడం, చేసే పనుల్లో స్నేహితుల, సహోద్యోగుల అభిప్రాయాలు తీసుకోవడం వల్ల నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. తోటివారితో సత్సంబంధాలు, వివిధ భాషలు తెలిసినవారితో మాట్లాడుతూవుండటం వల్ల భావవ్యక్తీకరణలోనూ నైపుణ్యాలు పెరుగుతాయి. కొన్ని సంస్థలు వివిధ నైపుణ్యాలు పెంపొందడానికి శిక్షణను కూడా ఇస్తున్నాయి. అలాంటి సంస్థల్లో చేరి కూడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

* ఎంబీఏ- మార్కెటింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేశాను. పరిశోధన రంగంలో ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఓ సంస్థలో ఆపరేషన్స్‌ అనలిస్ట్‌గా చేస్తున్నాను. ఇంకా చదవాలనే ఆసక్తి ఉంది. నా కెరియర్‌కు ఉపయోగపడే కొన్ని కోర్సుల వివరాలను తెలుపగలరు.

ఎంబీఏ- మార్కెటింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ ఆసక్తికరమైన కాంబినేషన్‌. ఈ కలయికలో ఉద్యోగావకాశాలున్నాయి. పరిశోధన చేయాలనుకునేవారు ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేయవచ్చు. సప్త్లె చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సర్వీస్‌ ఆపరేషన్స్‌- మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విషయాల్లో పరిశోధన చేయవచ్చు. ప్రత్యేకమైన కోర్సులపై ఆసక్తి ఉంటే పీజీ డిప్లొమాకు అవకాశముంది. లాజిస్టిక్స్‌ అండ్‌ సప్త్లె చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఈఆర్‌పీ, సీఆర్‌ఎం, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్టిక్స్‌ మొదలైనవి చేయవచ్చు.

ఎంబీఏ చదువుతున్నాను. వార్తా ప్రయోక్త (న్యూస్‌ రీడర్‌) కావాలనుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఏవైనా కోర్సులు చేయాలా? అందించే సంస్థలేవి?

* వార్తా ప్రయోక్త కెమెరా ముందు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇది సవాలుతో కూడిన వృత్తిగా చెప్పవచ్చు. కెమెరా/ మైక్‌ ముందు ఉండి ధారాళంగా మాట్లాడే నైపుణ్యం ఉండాలి. ఎప్పటికపుడు ఏదైనా వార్తను చదువుతూ రికార్డు చేసుకొని ప్రదర్శనను పరిశీలించుకుంటూ మెరుగుపరచుకోండి. ఇలా రికార్డు చేసుకుని పెట్టుకోండి. చాలాసార్లు ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌ను చదువుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా తాజా వార్తలు (బ్రేకింగ్‌ న్యూస్‌)కి సన్నద్ధత ఉండదు. అప్పటికప్పుడు ఆ సంఘటలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని సంక్షిప్తంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులు చేయడం వల్ల ఉద్యోగం సంపాదించడం సులభతరమవుతుంది.
* న్యూదిల్లీ వైఎంసీఏ, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ & ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వారి ఒక నెల న్యూస్‌ రీడింగ్‌ కోర్సు; ద జానకీదేవి మహావిద్యాలయ ఆఫ్‌ దిల్లీ యూనివర్సిటీ వారి షార్ట్‌ టర్మ్‌ కోర్సు; ద సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ & టెలివిజన్‌ (క్రాఫ్ట్‌) వారి న్యూస్‌ యాంకరింగ్‌, రేడియో జాకీ కోర్సులు చేయవచ్చు. ఉద్యోగానికి ముందుగా బ్రాడ్‌కాస్టింగ్‌ ఏజెన్సీ/ లోకల్‌ స్టేషన్‌లలో ఇంటర్న్‌గా చేసి ఉద్యోగం పొందడం సులభతరం చేసుకోండి. ఈ రంగంలో నిపుణులతో పరిచయాలు పెంచుకోవటం మేలు. సేకరించిన వార్తని వివరిస్తూ మీ పరిజ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఉద్యోగావకాశాలను పొందవచ్చు.

ఎంబీఏ (ఫైనాన్స్‌) 2014లో పూర్తిచేశాను. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో కెరియర్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను. ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాములనందించే సంస్థల వివరాలు తెలపగలరు.

* జేపీ మోర్గన్‌ (http://bit.ly/1x2NxPQ); గోల్డ్‌ మాన్‌ సాక్స్‌ (http://bit.ly/1H4hQsN); స్టాండర్డ్‌ చార్టర్డ్‌ (http://bit.ly/1MPNVTD); ఎస్‌ బ్యాంక్‌ (http://bit.ly/1EtmtGK); అవెండస్‌ (http://bit.ly/1H0QmAG); హెచ్‌ఎస్‌బీసీ (http://bit.ly/1loReGQ); మోర్గన్‌ స్టాన్లీ (http://mgstn.ly/1H4jVop) ఇచ్చిన వెబ్‌లింక్‌ల ద్వారా ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లింక్‌డ్‌ఇన్‌ ద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే హైరింగ్‌ మేనేజర్‌ను కూడా నేరుగా ఇంటర్న్‌షిప్‌ కోసం సంప్రదించవచ్చు.

ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. హెచ్‌ఆర్‌ స్పెషలైజేషన్‌ చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఉద్యోగాలను పొందడానికి తోడ్పడే ఏ కోర్సులు మేలు? ఉద్యోగావకాశాలనూ తెలియజేయండి.

ఇప్పటినుంచే తరగతి గది సిలబస్‌ మాత్రమే కాకుండా కెరియర్‌పై దృష్టి పెట్టడం మెచ్చుకోదగ్గ ఆలోచన. మీరు హెచ్‌ఆర్‌ వైపు వెళ్లాలనుకుంటే ముందుగా రిక్రూట్‌మెంట్‌ విభాగంలో కన్సల్టెన్సీ/ ఇతర సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే చిన్న సంస్థల్లో అయితే ఫ్రెషర్‌ అయినప్పటికీ రిక్రూట్‌మెంట్‌తోపాటు ఇతర (ట్రెయినింగ్‌, పేరోల్‌, పర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ వగైరా) విభాగాల్లో కూడా పనిచేయడానికి వీలుంటుంది. ఎస్‌ఏపీ, ఒరాకిల్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ లాంటి ఈఆర్‌పీ కోర్సులు అనుభవం లేకుండా చేయడం వృథా. కోర్సులో చేరడం కంటే వీలైనపుడల్లా http://www.nationalhrd.org/chapter/hyderabadhttp://www.facebook.com/pages/India-HR-LIVE/125253134348579 వారి, http://meraevents.com/meetup.com లను గమనిస్తూ హెచ్‌ఆర్‌కి సంబంధించిన వర్క్‌షాప్‌/ సెమినార్‌, వెబినార్‌లు హాజరై ఎందరో నిపుణుల ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్‌, లింక్‌డిన్‌, క్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో అప్‌డేట్లను పొందవచ్చు. హెచ్‌ఆర్‌కు సంబంధించిన వ్యాసాలు, ఇతర ఉద్యోగావకాశాలకు ఈ వెబ్‌సైట్‌ http://on.fb.me/1EtvQtl చూడండి.

బీఎస్‌సీ చేసి ఎంబీఏ (ఫైనాన్స్‌) చేస్తున్నాను. బీకాం నేపథ్యం లేనివారిని సంస్థలు తీసుకోవని చెబుతున్నారు. నిజమేనా? ఉద్యోగసాధనకు వేరే కోర్సులేమైనా చేయాల్సి ఉంటుందా? తెలియజేయగలరు.

బీకాం చేసినవారికి కామర్స్‌ సబ్జెక్టుపై పట్టు ఉంటుందని అంటే, మిగతా వారు ఎవరూ అందులో రాణించలేరని కాదు. ఇది కేవలం డిగ్రీల మీద కాకుండా నైపుణ్యాలను బట్టి ఉంటుంది. మీరు బీకాం చేయకపోయినా ఆ కామర్స్‌ సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఇక ఫైనాన్సులో కూడా అకౌంటింగ్‌తో మొదలుపెట్టి కమర్షియల్‌ బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, ఇన్సూరెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, మనీ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి విభాగాల్లో కెరియర్‌ను మలచుకోవచ్చు. మీ ఇష్టాలకు తగ్గట్టుగా ఈఆర్‌పీ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కంపనీ సెక్రటరీ, సీఎఫ్‌ఏ, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ కోర్సు, లీడ్‌ ఆడిటర్‌, బ్యాంకింగ్‌, స్టాటిస్టిక్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, టాక్సేషన్‌, ఫైనాన్స్‌ రంగానికి సంబంధించిన ఇతర అంతర్జాతీయ, మరెన్నో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేయవచ్చు.

ఎంబీఏ పూర్తి చేశాను. జర్నలిజంపై ఆసక్తి ఉంది. తెలుగులో జర్నలిజం కోర్సులను అందించే సంస్థల, కోర్సుల వివరాలు తెలుపగలరు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2 సంవత్సరాల వ్యవధి గల మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ & జర్నలిజం, ఒక ఏడాది వ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ టెలివిజన్‌ జర్నలిజం వివరాల కోసం http://bit.ly/1Bub6Rd చూడండి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఒక సంవత్సరం వ్యవధి గల మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ & జర్నలిజం వివరాల కోసం http://bit.ly/1CuDvVz చూడండి. డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వారి 1- 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్‌ రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు (PGDWMMT) కూడా ఉంది.

బీఎస్సీ తరువాత ఎంబీఏ (ఫైనాన్స్‌) 2010లో పూర్తిచేశాను. ప్రస్తుతం అడ్మిన్‌/ ఫెసిలిటీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. దీనికి సంబంధించిన కోర్సులేమైనా ఉన్నాయా? ఈ రంగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఎంబీఏ ఫైనాన్స్‌ చేశారు కాబట్టి మీరు అదే సంస్థలో అకౌంట్స్‌, బ్యాంకింగ్‌, అసెట్స్‌ & లయబిలిటీస్‌, వర్కింగ్‌ కాపిటల్‌, కాస్టింగ్‌, బడ్జెటింగ్‌, ప్రాఫిట్‌-లాస్‌, ఇన్సూరెన్స్‌, లోన్స్‌, ఎంఐఎస్‌, ఫైనాన్షియల్‌ ఆడిట్‌, పేరోల్‌లకు సంబంధించిన పనులను నేర్చుకోండి. దీనికి మీరు అడ్మిన్‌/ ఫెసిలిటీ పనులు చేసుకుంటూనే పైన తెలిపిన పనులను గమనిస్తూ వీలు అయినప్పుడల్లా సంబంధిత అధికారులను అడిగి నేర్చుకుంటూ ఉండండి.
మీ ఉత్సుకతను బట్టి సంబంధిత మేనేజర్‌ మీకు ఆయా పనులను అదనంగా అప్పగించే అవకాశం లేకపోలేదు. మీ ఇష్టాలకు తగ్గట్టుగా ఈఆర్‌పీ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, సీఎఫ్‌ఏ, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ కోర్సు, లీడ్‌ ఆడిటర్‌, బ్యాంకింగ్‌, స్టాటిస్టిక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, టాక్సేషన్‌, ఫైనాన్స్‌ రంగానికి సంబంధించిన ఇతర అంతర్జాతీయ, మరెన్నో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేయవచ్చు.

ఎంబీఏలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదవాలనుకుంటున్నాను. విదేశాల్లో దీన్ని అందించే విశ్వవిద్యాలయాలు, ఇంటర్న్‌షిప్‌ వివరాలు తెలుపగలరు. అలాగే కోర్సు ప్రాముఖ్యం, ఉద్యోగావకాశాలనూ తెలియజేయండి?

ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందించే విశ్వవిద్యాలయాల కోసం www.forbes.com/business-schools/list/international/ ను చూడండి.
ఉద్యోగావకాశాల కోసం టాటా మోటార్స్‌, హూండాయ్‌ మోటార్స్‌ వంటి సంస్థల్లో ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో ప్రొక్టార్‌ &గాంబుల్‌, నెస్లే, ఇంజినీరింగ్‌ &ఎఫ్‌ఎంసీజీ సంస్థల్లో ఎగుమతి/ దిగుమతి విభాగాల్లో, మార్క్స్‌ షిప్పింగ్‌, మిత్సుబిషీ షిప్పింగ్‌ సంస్థల్లో, థామస్‌ కుక్‌ వంటి ట్రావెల్‌/ టూరిజం సంస్థల్లో, డీహెచ్‌ఎల్‌, ఎక్సెల్‌ లాంటి లాజిస్టిక్స్‌ కంపెనీల్లో, ఎంసీ కిన్సే, ప్రిన్స్‌ వాటర్‌ హౌజ్‌ లాంటి కన్సల్టెన్సీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు కోర్సు చేస్తూనే ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. వివిధ ఇంటర్న్‌షిప్‌ అవకాశాల అవగాహనకు http://bit.ly/1wO8yZW ను చూడండి.

నేను ఫైనాన్స్‌ ప్రత్యేకంగా ఎంబీఏ చదివాను. ప్రస్తుతం బీమా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను. కానీ ఆ బృందంలో ఎటువంటి గుర్తింపూ లేకుండా పని చేయడం నాకు నచ్చడం లేదు. నేను చేస్తున్న పనిలో మార్పు కోరుకొంటున్నాను. స్టాక్‌మార్కెట్‌ వ్యవహారాలూ, పెట్టుబడులకు సంబంధించిన ఓ సదస్సుకి ఈ మధ్య హాజరయ్యాను. చాలా ఆసక్తిగా అనిపించింది. వాటిపై అవగాహన కూడా వచ్చింది. నేను స్పానిష్‌ బాగా మాట్లాడగలను. ఏ పని అప్పగించినా సమర్థంగా చేయగలననే నాకు ఉంది. నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నా వయసు ఇరవై ఒకటి. ఏ కెరీర్‌లో అడుగుపెడితే మంచిదో సలహా ఇవ్వరడి?

మీదింకా చిన్న వయసే. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడే గుర్తింపు గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. దాని గురించి ఆలోచించే బదులు పని వాతావరణం, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాల గురించి లోతుగా తెలుసుకోవడం మంచిది. అందుకు తగిన ఏ అవకాశం వచ్చినా నిరూపించుకొనే ప్రయత్నం మొదలుపెట్టండి. ఇప్పుడు నేర్చుకుంటున్న పనిపై ఆసక్తి లేకపోతే మీరు ఇష్టపడే విభాగంలో అవకాశం ఉందేమో అక్కడ అధికారులని అడిగి చూడండి. మీరనే కాదు.. కెరీర్‌లో ముందంజ వేయాలనుకొనేవారు పని అడగడం, కొత్త లక్ష్యాలు చేపట్టడం, వాటి సాధనలో తమని తాము నిరూపించుకోవడం ద్వారానే విజయం సాధిస్తారు. మన చదువూ, ఆసక్తులకు సంబంధం ఉందా లేదా అన్నది కెరీర్‌లో అడుగు పెట్టాకనే మనకి అర్థం అవుతుంది. ఇక, మనం చేస్తున్న పని కాకుండా ఇతర రంగాల గురించి వింటున్నప్పుడు ఆసక్తిగా ఉండటమూ సహజం. కానీ అందులో కెరీర్‌ వెతుక్కోవాలంటే లోతుగా ఆలోచించాల్సిందే. స్టాక్‌మార్కెట్‌ గురించి ఒక్కసారి విని అందులో కెరీర్‌ బాగుంటుందని దాని గురించి ఆలోచిస్తూ చేస్తున్న పనిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. అలాని రాజీ పడాల్సిన అవసరం లేదు. కొత్తగా చేయాలనిపించినప్పుడు మీ చదువుతో ఏమాత్రం సంబంధం లేని 'అవుటాఫ్‌ బాక్స్‌' తరహా ఆలోచనలు చేయండి. ఆర్కిటెక్చర్‌, వెబ్‌ డెవలపింగ్‌, లాండ్‌స్కేపింగ్‌ వంటి రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మీకు నాయకత్వ లక్షణాలని పెంచుకోవడం అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించి స్టార్టప్‌గా ఎదిగినా మంచిదే.
ఇంకా సందేహాలు ఉంటే మీరీ ప్రశ్నలకు ముందుగా మీకు మీరు జవాబు చెప్పుకోండి. మీరెటువంటి జీవితాన్ని కోరుకొంటున్నారు... ఏ తరహా పని మీ జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది... వీటితో పాటూ మీ ఆసక్తులూ, సంతోషాల గురించి ఆరా తీయండి. మీరు స్పానిష్‌ బాగా మాట్లాడతానని చెప్పారు కదా! అనువాద రంగంలోనూ చక్కని ఉపాధి అవకాశాలుంటాయి కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టి చూడండి.

పదోతరగతి 2000 సంవత్సరంలో పూర్తిచేశాను. కొన్ని కారణాల రీత్యా చదువు కొనసాగించలేకపోయాను. నాలుగు సంవత్సరాల తరువాత ఇంటర్‌ పూర్తి చేయకుండానే నేరుగా డిగ్రీ దూరవిద్య (డా. బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం) ద్వారా పూర్తిచేశాను. తరువాత ఎంబీఏ రెగ్యులర్‌ చేశాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఇంటర్‌ అర్హతగా ఉంది. వాటికి నేను దరఖాస్తు చేసుకోవచ్చా?

డిగ్రీని డా. బీఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ద్వారా, ఎంబీఏ రెగ్యులర్‌గా చేశారు కాబట్టి ఇంటర్‌ లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత పై చదువులు అంటే డిగ్రీ/ ఎంబీఏ సర్టిఫికెట్‌లను జత చేసి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇప్పుడు కూడా ఇంటర్‌ చేయవచ్చు.

ఎంబీఏ పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి ఉంది. నాకు ఐటీ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుపగలరు.

చాలామంది విద్యార్థులు SAP, Oracle వారి ERP కోర్సులు చేసి లేని అనుభవాన్ని చూపిస్తూ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. 2- 3 సంవత్సరాల అనుభవం వచ్చాక ఇలాంటి ERP కోర్సులు చేయడం ఉత్తమం. మీరు ప్రీసేల్స్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫంక్షనల్‌/ టెక్నికల్‌ ఐటీ కన్సల్టెంట్స్‌ లాంటి విభాగాల్లో మీ కెరియర్‌ను ఆరంభించవచ్చు. పూర్తి వివరాలకు http://bit.ly/1oRk18P వెబ్‌సైట్‌ను చూడండి.

ఎంబీఏ మార్కెటింగ్‌ 2011లో పూర్తిచేశాను. SAP బిజినెస్‌ ఆబ్జెక్ట్స్‌ కోర్సు కూడా చేశాను. ఈ కోర్సుకు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను తెలియజేయండి. అలాగే కూర్చుని చేసే మార్కెటింగ్‌ ఉద్యోగానికి తోడ్పడే ఇతర కోర్సుల వివరాలు తెలుపగలరు.

మీరు SAP బిజినెస్‌ ఆబ్జెక్ట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం ఈ లింక్‌లను చూసి దరఖాస్తు చేసుకోండి. http://bit.ly/1iRGmvYhttp://bit.ly/RXVYbPhttp://bit.ly/1j0LZg2. SAP నిర్వహించే శిక్షణ కార్యక్రమాల వివరాలకు http://bit.ly/1lnEVIH చూడండి. పెరుగుతున్న జనాభా, ఆన్‌లైన్‌లో వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నందువల్ల డిజిటల్‌ మార్కెటింగ్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (SEO), సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (SEM), డిస్‌ప్లే ఆడ్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ (SMM), ఈమెయిల్‌ మార్కెటింగ్‌, మొబైల్‌ మార్కెటింగ్‌, అఫ్లియేట్‌ మార్కెటింగ్‌ వంటివి డిజిటల్‌ మార్కెటింగ్‌లో ముఖ్యాంశాలు. వీటిని నిర్వహించే కోర్సుల వివరాల గురించి http://bit.ly/QPmz9V వెబ్‌సైట్‌ని చూడండి.

ఎంబీఏ హెచ్‌ఆర్‌ & ఫైనాన్స్‌ స్పెషలైజేషన్లు చేశాను. కెరియర్‌ అవకాశాల గురించి తెలుపగలరు.

ఎంబీఏ చేసిన తర్వాత మీకు వ్యాపారాల లావాదేవీలు- అంటే హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ లాంటి అంశాల్లో అవగాహన వస్తుంది. మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ అండ్‌ ఫైనాన్స్‌ తీసుకున్నారు కాబట్టి మానవ, ఫైనాన్స్‌ వనరుల నిర్వహణ గురించి తెలుసుకుని ఉంటారు. చదివిన థియరీకీ, వాస్తవానికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్నది గ్రహించండి. హెచ్‌ఆర్‌ వైపు వెళ్లాలనుకుంటే ముందుగా నియామకాల విభాగంలో కన్సల్టెన్సీ/ఇతర కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే చిన్న కంపెనీల్లో అయితే ఫ్రెషర్‌ అయినప్పటికీ రిక్రూట్‌మెంట్‌తోపాటు ఇతర (ట్రైనింగ్‌, పేరోల్‌, పెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ వగైరా) విభాగాల్లో కూడా పనిచేయడానికి వీలుంటుంది. ఫైనాన్స్‌లో కూడా అకౌంటింగ్‌తో మొదలుపెట్టి కమర్షియల్‌ బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, ఇన్స్యూరెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, మనీ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి విభాగాల్లో కెరియర్‌ను మలచుకోవచ్చు.

ఎంబీఏ (ఫైనాన్స్‌) 2010లో పూర్తిచేశాను. ఎకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. కెరియర్‌లో ఉన్నతి కోసం అకౌంట్స్‌ సంబంధిత కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి.

మీరు SAPలో ఫైనాన్స్‌& కంట్రోలింగ్‌ SAP- FiCo (www.sap.com) మాడ్యూల్‌ నేర్చుకుని ఇంటిగ్రేషన్‌, ఆటోమేషన్‌ కోసం ఈఆర్‌పీ ఉపయోగించే సంస్థల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ - సీఎఫ్‌పీ (www.fpsbindia.org/scripts/CFPCertification.aspx) చేసి ఒకరి అవసరాలను అర్థం చేసుకుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, పన్ను ఆదా చేయడం, బీమా పథకం ఎంచుకోవడం, స్టాక్‌ నిర్వహణ- ఇలా వారి ఆర్థిక లక్ష్యాన్ని అందుకోవడానికి సహకరించే ఫైనాన్షియల్‌ ప్లానర్‌ కావచ్చు. కాస్ట్‌ అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, టాక్సేషన్‌, సెక్రటరీషిప్‌ వాటి కోసం కాస్ట్‌& వర్క్‌ అకౌంటెన్సీ (ఐసీడబ్ల్యూఏ), చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ (సీఏ), కంపెనీ సెక్రటరీషిప్‌ (సీఎస్‌) లాంటి కోర్సులున్నాయి. (http://students.icai.org/),సీఎమ్‌ఏ కోర్సు గురించి http://icmai.in/ని చూడండి. ఇవేకాకుండా సెబీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, క్రిసిల్‌, ఐఆర్‌డీఏ, ఐఎఫ్‌బీఐ వారు నిర్వహించే డిప్లొమా, పీజీ డిప్లొమా, ఇతరత్రా కోర్సుల్లో మీకు ఇష్టమైనవి ఎంచుకోవచ్చు (http://bit.ly/1ga2Bgt).

ఎంబీఏ చేశాను. నాకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి ఉంది. స్నేహితులు SAP- HR, ఒరాకిల్‌ చేయమని సలహా ఇచ్చారు. ఏమి చేయాలో వివరించండి.

SAP-HR/ Oracle- HRMS లో ఉండే హెచ్‌ఆర్‌కి సంబంధించిన మాడ్యూళ్లను బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా కంపెనీలో పనిచేసి వాటికి సంబంధించిన వాటిలో అవగాహన తెచ్చుకోవాలి. చాలామంది విద్యార్థులు ఉద్యోగం రాలేదనీ/ ఈఆర్‌పీ మీద ఇష్టంతోనో ఎంబీఏ చేసిన వెంటనే ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరతారు; కంపెనీలో అనుభవం ఉన్నట్టు నకిలీ సర్టిఫికెట్లు పొందుతారు. వీటితో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తూ రిస్క్‌ తీసుకుంటుంటారు. ఇలాంటి కోర్సులో చేరేముందు స్టార్ట్‌అప్‌ కంపెనీలో అయినా సరే ఉద్యోగం సంపాదించి 2-3 సంవత్సరాలు రిక్రూట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఐఎస్‌, టైమ్‌& అటెండెన్స్‌, పేరోల్‌, పర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌, ట్రైనింగ్‌ వంటి వాటిలో అనుభవం తెచ్చుకోవాలి. సైమన్స్‌, జెనోవేట్‌, డెల్ఫి కమ్యూటెక్‌, బోస్టన్‌ సాఫ్ట్‌వేర్‌, కాగ్నిజంట్‌ లాంటి గుర్తింపు పొందిన సర్టిఫైడ్‌ కోర్సులో చేరొచ్చు. www.facebook.com/passion4careerని లైక్‌ చేసి కెరియర్‌కు సంబంధించిన ఎన్నో ఉచిత ఆర్టికల్స్‌ని చదివి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి.

ప్రస్తుతం నేను ఒక మంచి సంస్థలో స్టోర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. ఈ రంగంలో నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. బీకాం తరువాత ఎంసీఏ చేశాను. శాప్‌ (ఎంఎం), ఎంబీఏ (ఎంఎం)ల్లో ఏది ఎంచుకుంటే మేలు?

శాప్‌ (ఎంఎం), ఎంబీఏ (ఎంఎం) ఉభయ పరిపూరకాలు కావు. పైగా ఎంబీఏ చేసినవారు కూడా శాప్‌ కోర్సు చేయడం సాధారణం. శాప్‌ ఒక నైపుణ్యానికి సంబంధించినది. ఇది మీకు వర్తమానానికి అవసరమైన కుశలతను సూచిస్తుంది. ఎంబీఏ ఒక విశ్వవిద్యాలయం నుంచి ఇచ్చిన విద్యార్హత ప్రమాణం. ప్రస్తుతం మీరున్న దశకు శాప్‌ ఎక్కువ ఉపయోగకారి. ప్రత్యామ్నాయంగా మీరు శాప్‌లో కూడా శిక్షణనిచ్చే ఎంబీఏ చేస్తే ఇంకా మంచిది.

ఎంబీఏ (ఫైనాన్స్‌) చేశాను. ప్రభుత్వరంగంలో ఎంబీఏ చేసిన వారికి ఉండే ఉద్యోగావకాశాలేంటి?

ఎంబీఏ ఫైనాన్స్‌ చేసినవారికి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్స్యూరెన్స్‌, నవరత్న/ PSUs, డిఫెన్స్‌, రైల్వేస్‌, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ సంస్థల్లో ఉపాధికి వీలుంది. ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌/ అడ్వైజర్‌/ ప్లానర్‌, లోన్‌ ఆఫీసర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, రిస్క్‌- ఇన్‌స్యూరెన్స్‌ మేనేజర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ సేల్స్‌ అసోసియేట్స్‌- ట్రేడర్స్‌, కార్పొరేట్‌ కంట్రోలర్స్‌, ట్రెజరర్స్‌, అకౌంటింగ్‌ ఆఫీసర్‌, ఎం అండ్‌ ఏ ఎనలిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ ఎనలిస్ట్‌, క్యాష్‌ మేనేజర్స్‌, రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌, ఫైనాన్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ లాంటి ఉద్యోగావకాశాలుంటాయి. సంబంధిత నోటిఫికేషన్ల గురించి www.employmentnews.gov.in చూస్తుండండి.

ఎంబీఏ (ఫైనాన్స్‌) చేసి అకౌంటింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేస్తున్నాను. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

ఫైనాన్స్‌ పరిశ్రమలో కొంత అనుభవం వచ్చాక పీహెచ్‌డీ చేయడం మంచి ఆలోచనే. ఇక వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రవేశాల కోసం ఈ వెబ్‌సైట్లను చూడండి. మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (www.mse.ac.in/admissionphd.asp); ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (http:// econdse.org/phd-admissioninfo-2013/); ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (www.isid.ac.in/~pu/phd.html); ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బాంబే (www.hss.iitb.ac.in/home/index.php/programmes/phd); ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ చేంజ్‌ (www.isec.ac.in/phd.htm); గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ (www.gipe.ac. in/PhD_Programme).

ఏపీసెట్‌, యూజీసీ నెట్‌ల వల్ల లాభాలేమిటి? ఎంబీఏ చేసినవారికి వీటి ద్వారా వచ్చే ఉద్యోగాలేమిటి?

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వారు బోధన, పరిశోధనలకు కనీస ప్రమాణాలను కలిగినవారిగా ధ్రువీకరించడానికి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)ను దేశవ్యాప్తంగా సంవత్సరానికి రెండుసార్లు (జూన్‌, డిసెంబర్‌) నిర్వహిస్తారు. రాత పరీక్షలో హ్యుమానిటీస్‌ (భాషలతో సహా), సోషల్‌ సైన్సెస్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌- అప్లికేషన్స్‌, ఎలక్ట్రానిక్‌ సైన్సెస్‌ వంటి అంశాలుంటాయి. మాస్టర్‌ డిగ్రీలో 55% మార్కులు (50% మార్కులు- ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీహెచ్‌/ వీహెచ్‌ వారికి) ఉండి, 28 సంవత్సరాల వయసు (రిసెర్చ్‌ ఫెలోషిప్‌కి మాత్రమే) దాటనివారు ఈ పరీక్షకు అర్హులు. మీరు మాస్టర్‌ డిగ్రీ చేసిన సబ్జెక్టుని ఎంచుకుని దానికి సంబంధించిన పరీక్ష రాయాల్సి ఉంటుంది.
యూజీసీ నెట్‌ మాదిరిగానే, ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ గుర్తింపుతో మనరాష్ట్ర పరిధిలో ఉండే లెక్చరర్‌, రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ఉద్యోగాల కోసం ఏపీసెట్‌ను నిర్వహిస్తోంది. యూజీసీ గురించి మరిన్ని వివరాలకు http://ugcnetonline.in నూ, ఏపీసెట్‌ కోసం http://www.apset.org వెబ్‌సైట్‌నూ చూడండి. ఈ రాతపరీక్ష ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం సంపాదించడానికి కనీస అర్హతగా చెప్పుకోవచ్చు. ఇది సాధించిన తర్వాత ఆయా ప్రభుత్వ ఎంబీఏ కళాశాలలవారు మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టుల్లో ఖాళీల గురించి ప్రకటన చేసినపుడు దరఖాస్తు చేసుకుకోవాలి. వారు నిర్వహించే రాత పరీక్షలు/ ఇతర ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం లభిస్తుంది.

ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేసి ఉద్యోగం చేస్తున్నాను. ఉన్నత స్థాయికి చేరడానికి హెచ్‌ఆర్‌కు సంబంధించిన ఏ కోర్సులు చేస్తే మేలు?

ఎంబీఏ చేయడం వల్ల ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఆపరేషన్స్‌ వంటి వాటి గురించి అవగాహన తెచ్చుకోవడమే కానీ పూర్తి నైపుణ్యం సంపాదించలేము. మీరు ఇదివరకే ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు కాబట్టి కనీసం 2- 3 సంవత్సరాల్లో మీకు నియామకం, శిక్షణ, పారిశ్రామిక సంబంధాలు, చేంజ్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌, పేరోల్‌/ కాంపెన్‌సేషన్‌/బెనిఫిట్స్‌, స్టాట్యుటరీ కాంప్లియన్స్‌, పర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌/ హెచ్‌ఆర్‌ఐఎస్‌ వంటి వాటిలో ఏది ఎంచుకుంటే మీకు ఎదుగుదల ఉంటుందో గ్రహించవచ్చు. తద్వారా ఎలాంటి కోర్సులు చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు హెచ్‌ఆర్‌ ఆటోమేషన్‌ కోసం ఒరాకిల్‌ హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్‌/ ఎస్‌ఏపీ- హెచ్‌ఆర్‌ వంటి కోర్సులు చేయడం, రిక్రూట్‌మెంట్‌ గురించి www.asktheheadhunter.com ని అనుసరించడం. ఇదివరకే మీరు మాస్టర్‌ డిగ్రీ చేశారు కాబట్టి డిప్లొమా/ దూరవిద్య కోర్సులు చేయడం అంత లాభదాయకం కాదు. దీనికి బదులు http://Quora.com వంటి ఫోరమ్‌ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.

బీటెక్‌ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. మంచి ఉద్యోగావకాశాలుండే స్పెషలైజేషన్‌ వివరాలు తెలుపగలరు.

ఎంబీఏలో స్పెషలైజేషన్‌ తీసుకునేముందు అసలు ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. ఈ కోర్సు చేయడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంది. అంతేకానీ ఎంబీఏ డిగ్రీ పొందిన వెంటనే మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించవచ్చని ఊహించుకోకండి. అలా జరగాలంటే పరిశ్రమలో తగిన అనుభవం సంపాదించుకోవాలి. కాబట్టి ముందుగా 2/3 సంవత్సరాల అనుభవం తెచ్చుకుని ఆ తర్వాత ఆసక్తిని బట్టి ఎంబీఏ చేయాలా వద్దా, ఎటువంటి స్పెషలైజేషన్‌ తీసుకోవాలి అనేవి నిర్ణయించుకోవచ్చు.

ఎంసీఏ 2009లో పూర్తిచేశాను. ఆర్థిక మాంద్యం కారణంగా నా వృత్తిని ఐటీ నుంచి వేరే రంగానికి మార్చాను. ఇప్పుడు మళ్లీ ఐటీ రంగంలోకి మారాలనుకుంటున్నాను. ఆ అవకాశముందా? కంపెనీలు ఫ్రెషర్లకే అవకాశమిస్తాయని విన్నాను. అదెంతవరకు నిజం?

ఈ వ్యవధి కాలంలో మీరు పనిచేసిన రంగం గురించి వివరించి ఉంటే బాగుండేది. ఏదేమైనా http://bit.ly/1lGEUBH చూస్తే ఈ 2014లో సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ సహా ఐటీ రంగంలో 8.5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనా తెలుస్తుంది. అందుకని మళ్లీ ఐటీ రంగంలో ఉద్యోగం కోసం నిశ్చింతగా ప్రయత్నించవచ్చు. ఏ కంపెనీ వారైనా అభ్యర్థులను తీసుకునేముందు ముఖ్యంగా వారు ఏవిధంగా తమ సంస్థకు లాభపడతారని పరిశీలిస్తారు.
మీరు ఫ్రెషర్‌ కాదనే విషయాన్ని మర్చిపోయి మొదట మీకు ఎందులో ఆసక్తి ఉందో గ్రహించండి. దానికి సరిపడే డొమైన్‌ని, సంస్థలను ఎంచుకోండి. ఉదాహరణకు మీకు ఆండ్రాయిడ్‌ ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి ఉంటే ముందుగా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.
www.facebook.com/passion4careerలో పొందుపరిచిన ఆండ్రాయిడ్‌ ప్రోగ్రామింగ్‌ వంటి ఇవెంట్ల ద్వారా ఇతరులతోపాటు ప్రాజెక్ట్‌ చేస్తూ మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఆరకంగా మీరు తయారుచేసిన ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ మార్కెట్‌లో అప్‌లోడ్‌ చేయండి. ఇక ఉద్యోగం కోసం నైపుణ్యాలను కేవలం CVతోనే కాకుండా బ్లాగ్‌, ఇతర సోషల్‌ మీడియా లింక్స్‌ ద్వారా ప్రదర్శించండి. మీ ప్రాజెక్టులను సదరు కంపెనీ టెక్నికల్‌ మేనేజర్‌లకు వివరించి ఉద్యోగ ప్రయత్నం చేయండి.

2010లో 80%తో ఎంసీఏ పూర్తిచేశాను. పెళ్లవడంతో ఉద్యోగంలో చేరలేదు. ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. కానీ ఫ్రెషర్‌గా చేయలేను. సలహా ఇవ్వండి.

మీకిప్పుడు రెండు దారులున్నాయి. మొదటిది మీరు ఏవైనా కంప్యూటర్‌ కోర్సులు చేయడం/ ఎంటెక్‌ చేయడం. ఎంటెక్‌ కోసం మీరు పీజీసెట్‌లో అర్హత పొందాల్సి ఉంటుంది. రెండోది కోచింగ్‌ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు/ బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నించడం. ఒకవేళ కంప్యూటర్‌ కోర్సు చేయదలచుకుంటే ఏదైనా కళాశాలలో ప్రోగ్రామర్‌గా చేరడం కూడా మంచిది.

ఎంసీఏ 2011లో పూర్తిచేశాను. ప్రస్తుతం పూణేలో ఒక ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. పార్ట్‌టైమ్‌/ దూరవిద్యలో ఎంబీఏ చేద్దామనుకుంటున్నాను. ఏ సబ్జెక్టును ఎంచుకోవాలి? ఈ కోర్సును అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

ఉద్యోగం చేస్తూ ఎంబీఏ పార్ట్‌టైం చేయాలనుకునేవారు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ www.ipeindia.org వారి ఎంబీఏ (పీఈ- పార్ట్‌టైం ఈవెనింగ్‌) 3 సంవత్సరాల/ 6 సెమిస్టర్ల ప్రోగ్రాం; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ (www.imt.edu) వారి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ డిప్లొమా (పీజీడీఎం- పార్ట్‌టైమ్‌) 3 సంవత్సరాల/ 9 టర్మ్స్‌; జేఎన్‌టీయూ (http://jntuh.ac.in/)వారి 6 సెమిస్టర్ల పార్ట్‌టైం ఎంబీఏ ప్రోగ్రాం చేయవచ్చు. వీటికి డిగ్రీ పూర్తిచేసి, సుమారు 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండి, ఐసెట్‌/ క్యాట్‌/ మాట్‌/ జీమాట్‌/ XATలో అర్హత సాధించి ఉండాలి. ఏఐసీటీఈ/ యూజీసీ వారి గుర్తింపు లేనివాటికి దూరంగా ఉండండి. మీరు కోర్సులో చేరేముందు ఎంచుకున్న విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు కాబట్టి ఐటీ/ సిస్టమ్స్‌కు సంబంధించిన సబ్జెక్టు తీసుకుంటే మంచిదే. లేదా హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ల్లో మీ ఇష్టానికి తగ్గ సబ్జెక్టు ఎంచుకోండి.

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ తరువాత ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు జేఎన్‌టీయూ ద్వారా చేస్తున్నాను. ఈ కోర్సు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఎటువంటి కోర్సులు చేస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల్లో ఉద్యోగం పొందవచ్చు?.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ అంటే నెట్వర్క్‌ డెలివరీ సెంటర్‌ని భద్రంగా కాపాడుకోవడం. నెట్వర్క్‌ సెక్యూరిటీని అర్థం చేసుకుని డేటా బ్యాక్‌అప్‌లో నిపుణులైన వెరిటాస్‌ వంటి వాటితో పనిచేయండి. డేటా సెంటర్స్‌ భద్రత గురించి ఈ www.cisco.com/web/learning/certifications/index.html#~specవెబ్‌సైట్‌ను చూడండి. నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ వంటి పుస్తకాల ద్వారా సొంతంగా నేర్చుకోండి. Akamai/ CtrlS వంటి కంపెనీలలో మొదట మీ కెరియర్‌ని ఆరంభించండి. 2- 3 సంవత్సరాల అనుభవం వచ్చాక కెరియర్‌లో ఎదుగుదలకు సిస్కో స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు చేయండి.

ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని. చదువు పూర్తయ్యేటప్పటికి ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ సాధనకు ఉపయోగమో తెలియజేయగలరు.

ఫలానా కోర్సు చేయడం అని కాకుండా ఇది పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎంసీఏలో నచ్చిన సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి సారించండి. అలాంటి సబ్జెక్టు బ్యాంకింగ్‌, టెలికాం, ఐటీ, మాన్యుఫాక్చరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇతర రంగాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలో ఆలోచించండి. ఏదైనా సరికొత్త పరిష్కారం కనుగొనే అప్లికేషన్‌ను సాఫ్ట్‌వేర్‌ తయారు చేయడానికి ప్రయత్నించండి. ఏదేమైనా కనీస ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాల కోసం C, C++ల్లో పరిణతి సాధించాలి. coursera, ఇతర వెబ్‌సైట్ల నుంచి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ని మెరుగుపరచుకోండి. మీ ఆసక్తిని ఆనందించతగ్గ కెరియర్‌లా మార్చుకోవడానికి ప్రేరణ కలిగించే www.facebook.com/passion4careerని అనుసరిస్తూ ఉండండి.

2012లో ఎంబీఏ పూర్తిచేశాను. లాజిస్టిక్స్‌ అండ్‌ సప్త్లె చైన్‌ మేనేజ్‌మెంట్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

ఒకప్పుడు లాజిస్టిక్స్‌ అండ్‌ సప్త్లె చైన్‌ మేనేజ్‌మెంట్‌ అనేది ఖర్చుని పెంచే డిపార్టుమెంటుగా భావించేవాళ్లు. కానీ ఇపుడు అదే విభాగం కంపెనీల్లో అయ్యే ఖర్చును ఆదా చేయడానికీ, ఉత్పాదక శక్తిని మెరుగుపరచడానికీ ఎంతో సహకరిస్తోంది. సప్త్లె చైన్‌ అనేది ఏదైనా ఉత్పత్తి తయారీలో అసెంబ్లీ ప్లాంట్‌ నుంచి స్టోర్స్‌, డిస్పాచ్‌, డెలివరీ, డిస్ట్రిబ్యూటర్‌, హోల్‌సెల్లర్‌/ రిటైలర్‌ ఇలా చివరికి వినియోగదారులకు తీసుకెళ్తుంది.
మీరు ఎంబీఏలో ఎలాంటి స్పెషలైజేషన్‌ తీసుకున్నారో చెప్పలేదు. ఒకవేళ ఎంబీఏ లాజిస్టిక్స్‌/ ఎస్‌సీఎంలో అయితే మీరు ఉద్యోగవేట మొదలుపెట్టవచ్చు. చిన్న సంస్థల్లో కంటే మధ్యతరహా/ పెద్ద కంపెనీల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు: కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌/ మేనేజర్‌, సప్త్లె చైన్‌ కన్సల్టెంట్‌/ ఎనలిస్ట్‌, పర్చేజింగ్‌ మేనేజర్‌, లాజిస్టిక్స్‌ మేనేజర్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజర్‌, వేర్‌హౌజ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌, సప్త్లె చైన్‌ సాఫ్ట్‌వేర్‌ మేనేజర్‌, ఇంటర్నేషనల్‌ లాజిస్టిక్స్‌ మేనేజర్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎస్‌సీఎం) వంటి ఎన్నో హోదాలుంటాయి.
వివిధ కోర్సులు, వర్క్‌షాపుల కోసం http://www.iimmbangalore.org/ Indian Institute of Materials Management (IIMM) వారి వెబ్‌సైట్‌ని చూడండి.

2011లో ఎంసీఏ పూర్తిచేశాను. డాట్‌నెట్‌ కూడా చేశాను. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ల్యాబ్‌ ప్రోగ్రామర్‌గా 18 నెలలు చేశాను. ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

మీకు ల్యాబ్‌ ప్రోగ్రామర్‌ అనుభవం ఉంది కాబట్టి ప్రోగ్రామింగ్‌, అకడమిక్‌ ప్రాజెక్టుల్లో అవగాహన ఉండి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి ఇంటర్న్‌షిప్‌లు చేయండి. ఉదాహరణకు http:// bit.ly/18g2COGhttp://bit.ly/15chMk2http://bit.ly/1aakNES వంటి వెబ్‌సైట్లలో మీకు నచ్చినవాటికీ దరఖాస్తు చేయండి. వీళ్లు ప్రాజెక్టుతోపాటు స్త్టెపెండ్‌ కూడా అందజేస్తారు. ఇలా ప్రాజెక్టు అనుభవానికి ల్యాబ్‌ ప్రోగ్రామర్‌ అనుభవం జత చేస్తూ ఉద్యోగం సంపాదించవచ్చు.

ఎంబీఏ ఫైనాన్స్‌ చదువుతున్నాను. ఈ విభాగంలో ఉపాధి అవకాశాలను తెలపండి.

ఎంబీఏ (ఫైనాన్స్‌) చేసినవారికి ముఖ్యంగా కింది రంగాల్లో ఉపాధి అవకాశాలుంటాయి.
కార్పొరేట్‌ ఫైనాన్స్‌: ఒక కంపెనీని నడపడానికి కావాల్సిన డబ్బు కోసం మూలాధారాన్ని వెతకడం, లాభనష్టాలు; ఫైనాన్షియల్‌ రిస్క్‌, వర్కింగ్‌ కాపిటల్‌, కాష్‌ ఫ్లో, మెర్జర్స్‌ అండ్‌ అక్విజిషన్స్‌ లాంటివి చూసుకోవడం.
కమర్షియల్‌ బ్యాంకింగ్‌: ఈ రంగంలో రోజురోజుకీ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి టెల్లర్స్‌/ క్యాషియర్‌, లీజింగ్‌ ఏజెంట్స్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్స్‌, బ్రాంచి మేనేజర్‌, లోన్‌ ఆఫీసర్‌, ట్రేడ్‌ క్రెడిట్‌ స్పెషలిస్ట్స్‌, క్రెడిట్‌ కార్డ్‌ బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్స్‌.
ప్రైవేటు ఈక్విటీ వెంచర్‌ క్యాపిటల్‌: చిన్న కంపెనీలు, ఇతరత్రా కంపెనీలకు క్యాపిటల్‌ మేనేజ్‌ చేయడం. ఇవి కాకుండా స్టాక్‌ బ్రోకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ఫోరెక్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, ఇన్సూరెన్స్‌, కమోడిటీ ట్రేడింగ్‌ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. కేవలం ఉద్యోగం పోర్టళ్ళపై ఆధారపడకుండా పైన తెలిపిన రంగానికి సంబంధించిన కంపెనీలను లింకెడిన్‌ ద్వారా సంప్రదించండి.

ేను ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేయాలనుకుంటున్నాను. నాకు విదేశంలో అడ్మినిస్ట్రేషన్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉంది. ICET, CAT రాసే సమయం లేదు.

రెండు సంవత్సరాల అనుభవంతో మీరు ఎంబీఏ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. కానీ కేవలం పేపర్‌ డిగ్రీ కోసం ఎంబీఏ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దూరవిద్య పద్ధతిలో చేయడానికి ఉస్మానియా యూనివర్శిటీ-పీజీఆర్‌ఆర్‌సీడీఈ, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ (ఐజీఎన్‌ఓయూ) వంటి వాటిలో మీరు ఎంబీఏ చేయవచ్చు. ఎంబీఏ చేసిన పలువురి అభిప్రాయాలను www.pagalguy.com/news/tag/why-mba సైట్‌ద్వారా తెలుసుకోండి.

ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మేము ప్రాజెక్టు వర్క్‌ చేయబోతున్నాము. ఏ అంశంపై చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వగలరు.

ఎంబీఏ చేసే ప్రతి విద్యార్థీ మొదటి సంవత్సరంలో ఏదో ఒక కంపెనీని సందర్శించాలి. విద్యార్థులకూ, పరిశ్రమకూ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టుల/ఇంటర్న్‌షిప్‌ల ఉద్దేశం. ఈ ప్రాజెక్టులకు మీరు ఎంచుకోబోయే స్పెషలైజేషన్‌లకు సంబంధం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. వర్కింగ్‌ కాపిటల్‌, అసెట్స్‌-లయబిలిటీస్‌, డిప్రిసియేషన్‌, ఈక్విటీ అనాలసిస్‌, సేల్స్‌ ప్రమోషన్‌, పర్‌ఫార్మెన్స్‌ అప్రిసియేషన్‌, ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వంటివి కొన్ని ప్రధాన అంశాలు. ఇవి కంపెనీ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడానికే కాక మీకూ ఓ అవగాహన పెంచుకోవడానికి తోడ్పడతాయి.

ఎంబీఏ (ఫైనాన్స్‌) చదువుతున్నాను. నాకు రిజర్వు బాంకు ఆఫ్‌ ఇండియాలో పనిచేయాలని ఉంది. వివరాలు తెలపండి.

ఆర్‌బీఐ వారు అసిస్టెంట్స్‌, ఆఫీసర్స్‌ ఇలా పలు రకాల పోస్టులకు ఎప్పటికపుడు ప్రకటన జారీ చేస్తూ ఉంటారు. మీరు http://rbi.org.in/scripts/vaccancies.aspx లింక్‌లో నోటిఫికేషన్‌ వివరాలు పొందొచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఫైనాన్స్‌ వాటిపై పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ముందుగా ఆర్‌బీఐలో సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్‌ http://bit.ly/11Yg5VUని చూడండి.

ఎంబీఏ ఫైనాన్సు పూర్తిచేశాను. ఈ మధ్య SAP-FICO కూడా నేర్చుకున్నాను. మా స్నేహితులు నన్ను కన్సల్టెన్సీలను సంప్రదించమని సలహా ఇచ్చారు. కానీ ఎలాంటి ఫలితమూ లేదు.

చాలామంది ఎంబీఏ అయిన వెంటనే SAP/ Oracle ERP కోర్సులను ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తిచేస్తే మంచి ఉద్యోగం సంపాదించొచ్చని ఊహించుకుంటారు. కానీ ఎలాంటి అనుభవం లేకుండా ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌లు అందరూ నేర్చుకుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇంకా కొందరు నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి చేయకుండా ముందుగా మీకు నచ్చిన కంపెనీలో మీ స్పెషలైజేషన్‌కు తగిన ఉద్యోగాన్ని 3 సంవత్సరాలు చేయండి. అలా చేస్తూనే ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఎలా వాడుతారో, అలాంటి కంపెనీలు ఏవో తెలుసుకుని సంప్రదించండి.

మా అమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలంటే ఎటువంటి కంప్యూటర్‌ ప్రోగ్రాములు నేర్చుకోవాలి? హైదరాబాద్‌లో ఆయా కోర్సులపై శిక్షణనిచ్చే సంస్థల వివరాలు తెలపండి.

విద్యార్థి ఎంబీఏలో చేసిన స్పెషలైజేషన్‌, ఏ రంగంపై ఆసక్తి ఉందో అనేవి ఇలాంటి సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎలాంటివారికైనా కనీసం కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం, MS Office తెలిసి ఉండడం అవసరం. ఇక ఫైనాన్సు వారికి Tally లాంటి అకౌంటింగ్‌ పాకేజెస్‌ అవసరం. పైన తెలిపిన విధంగా చాలామంది ఎంబీఏ అయిన వెంటనే అనుభవం సంపాదించకుండానే SAP, ERP Oracle కోర్సులు చేస్తుంటారు. పరిశ్రమలో అనుభవం లేకుండా ఇలాంటి కోర్సులు చేయడం వృథా. ముందుగా Connect The Dots అనే పుస్తకాన్ని చదవమని చెప్పండి. ఎలాంటి శిక్షణ లేకుండా తమ ప్రతిభను నమ్ముకుని స్వతహాగా ఎంతోమంది ఎలా కెరియర్‌లో ఎదిగారో తెలుస్తుంది.

ఎంబీఏ ఫైనాన్స్‌ చదువుతున్నాను. నాకు సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ కావాలనివుంది. దీనికి సంబంధించిన కోర్సు, అవకాశాలు ఎలా ఉంటాయో తెలుపగలరు.

దీనికి ముఖ్యంగా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, 3-5 సంవత్సరాల అనుభవం అవసరం. నిజాయతీగా ఉండేవారు అర్హులు. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ ఇండియా అనే ప్రభుత్వ- ప్రైవేటు సంయుక్త సంస్థ సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ లాంటి కోర్సులను నిర్వహిస్తోంది. కోర్సు వివరాలకు www.fpsbindia.org/ వెబ్‌సైట్‌ చూడండి. దీనిద్వారా దేశవిదేశాల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కెరియర్‌ మొదలుపెట్టవచ్చు.

నా ఎంసీఏ ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ఈ మధ్యే పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి సంవత్సరంలో ప్రాజెక్టు చేయాల్సి ఉంది. ఎలాంటి కోర్సులు ఏ సంస్థలో చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి.

ప్రాజెక్టు వర్క్‌ ఎంత ఇష్టంతో చేస్తే అంత మంచి ఫలితం! మీ నిర్వహణ/పనితనం బాగుంటే అదే కంపెనీలో మీరు ఉద్యోగం సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ప్రాజెక్టును ఏదో శిక్షణసంస్థలో చేసి ఆ చక్కటి అవకాశాన్ని వృథా చేసుకోకండి.
ఐఐటీ, ముంబాయిలో చదివి ప్రాజెక్టు/ఇంటర్న్‌షిప్‌ల కోసం చాలా కష్టపడిన అనుభవంతో మొదలుపెట్టిన http://www.hellointern.com వెబ్‌సైటును చూస్తే ఏ కంపెనీ వాళ్లు ఎలాంటి ప్రాజెక్టులు/ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం ఇస్తున్నారో తెలుస్తుంది. మీకు ఇష్టమైన సబ్జెక్టుకు అవకాశం ఉంటే INKONIQ, IPintentio, Knowlarityలాంటి చిన్నచిన్న లేదా ఎదుగుతున్న కంపెనీల్లో ప్రాజెక్టు చేయడం చాలా మంచిది.

ఎంబీఏ ఫైనాన్స్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. స్టాక్‌ మార్కెట్‌పై ఆసక్తి. దీనికి తగ్గట్టుగా నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలి?

స్టాక్‌ మార్కెట్‌పై http://www.stock-trading-infocentre.com/లాంటి ఫోరమ్స్‌ లేదా బ్లాగుల ద్వారా ఉచితంగా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి (http://www.nseindia.com/education/content/education.htm), బాంబే స్టాక్‌ ఎక్స్చేంచి (http://www.bseindia.com/#training)వాళ్లు స్టాక్‌ మార్కెట్‌లపై వివిధ కోర్సులను నిర్వహిస్తున్నారు.

B.Tech. ECE 2012 లో పూర్తిచేశాను. నాకు MBAచేయాలని ఉంది. చాలామంది Executive MBA చేయమని చెబుతున్నారు. నాకు తగిన MBA ఎక్కడ, ఎప్పుడు చేయాలో చెప్పండి.

ఎంబీఏ చేసేముందు 2/3 సంవత్సరాలు మీకిష్టమయిన రంగంలో అనుభవం తెచ్చుకోండి. ISB, IIM, Great Lakes, SP jain , XLRI లాంటి ఇన్‌స్టిట్యూట్లలో Executive MBA చేయొచ్చు. ఉద్యోగం చేస్తున్నవాళ్లకి 1 సంవత్సర కాలం ఉండే ప్రోగ్రాం మంచిది. ఇలా చేస్తే మీరు సులభంగా ప్రశ్నలు వేసుకుంటూ, Debateచేస్తూ, ఇతరులతో వాళ్ల అనుభవాలను academics కు అనుసంధానిస్తూ సరికొత్త management conceptsని పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. http://goo.gl/cly2n

ఎంసీఏ 2012లో పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఐటీ కంపెనీల్లో చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ ఇప్పటివరకూ ఉద్యోగం రాలేదు. ఫ్రెషర్‌గా ఐటీ సంస్థలో ఎలా ఉద్యోగం సంపాదించాలో సలహా ఇవ్వండి.

కోర్సు పూర్తి చేశాక ఫ్రెషర్‌ అనే ఆలోచన ఉండకూడదు. కోర్సులో భాగంగా చేసిన, ప్రాజెక్టు వర్కు లాంటి సదవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. బియటి సంస్థల్లో కాకుండా పరిశ్రమలో చేసి, వాటిలో ఎలాంటి ప్రావీణ్యం రావాలో తెలుసుకోవాలి. అలా చేసివుంటే తరగతి సిలబస్‌ మించి ఇంకా ఏమేం, ఎలా నేర్చుకోవాలో తెలుస్తుంది. ఏ కంపెనీ అయినా ఎవర్ని తీసుకుంటే ఎలా ఉపయోగపడతారని ఆలోచించి, ఎంపిక చేసుకుంటుంది. దీనికి ముందు మీరు చేయాల్సింది ఒక అంశాన్ని (ఏరియా) ఎంచుకుని దానిపై మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం. కేవలం సి.వి.ని హెచ్‌ఆర్‌కి పంపటం వల్ల ఉపయోగమేమీ ఉండదు. సోషల్‌ మీడియా సైట్స్‌లో మీ ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మల్చుకోండి. మీకు నచ్చిన సంస్థల గురించి తెలుసుకోవడం ఇంటర్వ్యూకు సన్నద్ధం కావడంలో తొలి మెట్టు.

ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉన్నాను. తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఎంబీఏ మనదేశంలో చేస్తే మంచిదా? విదేశాల్లో మెరుగా?

ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టులపై దృష్టిపెట్టండి. శిక్షణ సంస్థల్లో కాకుండా మంచి స్టార్టప్‌ కంపెనీల్లో వీటిని చేస్తూ వివిధ విషయాలు పరిశీలిస్తుండాలి. సాంకేతిక, నిర్వహణ సంబంధ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. ఇంజినీరింగ్‌ తర్వాత రెండు మూడు సంవత్సరాల అనుభవంతో ఎంబీఏ చేస్తే చాలా మంచిది. కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్‌గా వాటిని ఎక్కడ, ఎలా వినియోగిస్తారో తెలుసుకుంటూ ఉండండి. ఎంబీఏ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు కింది వెబ్‌సైట్‌లో ఉన్న కథనాన్ని చదవండి. http://goo.gl/pDGnM

నా బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) 2013లో పూర్తవుతుంది. దీని తర్వాత ఎంబీఏలో చేరాలనుకుంటున్నాను. కానీ మ్యాథ్స్‌ వాళ్ళకు ఎంబీఏలోని సబ్జెక్టులు సరిగా అర్థం కావనీ, ఉద్యోగం త్వరగా రాదనీ విన్నాను. నిజమేనా? ఒకవేళ ఎంబీఏ చేస్తే ఏది చేయాలి?

మీరు విన్నది అపోహ మాత్రమే. అయితే ఎంబీఏ కేవలం డిగ్రీ కోసమే కాకుండా మీ కెరియర్‌కు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. ఇది పూర్తిగా మీ ఆసక్తిపై ఆధారపడివుంటుంది. ఎంబీఏపై విభిన్న రకాల విశ్లేషణకూ, తమ కెరియర్‌లో కొందరు ఎలా ఎంబీఏను వినియోగించుకుంటున్నారో ఈ లింకులో తెలుసుకోండి. http://goo.gl/cly2n

ఎంసీఏ 2012లో పాసయ్యాను. ఐటీ కంపెనీల్లో చాలా ఇంటర్వ్కూ వెళ్ళాను. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఫ్రెషర్‌గా ఐటీ కంపెనీల్లో ఎలా ఉద్యోగం సంపాదించాలో సూచించండి.

ఏదో ఒక ఉద్యోగం అని కాకుండా ఒక ఏరియాను ఎంచుకుని, దానిపై ధ్యాస పెట్టండి. సీవీతో మాత్రమే కాకుండా మీరు ఎంచుకున్న దానిపై బ్లాగు రాస్తూ, ఆ రంగంలో ఉండే అనుభవజ్ఞులూ, కంపెనీల కోసం లింక్‌డిన్‌ లాంటి సైట్ల ద్వారా వెతకండి. వారితో నేరుగా అనుసంధానమై, మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించి, వాళ్ళకు ఎలాంటి విలువను మీరు తీసుకురాగలుగుతారన్నది వివరించండి. ఈ ప్రక్రియలో ఉద్యోగ సాధనకు దగ్గరవుతారు.

ఎంసీఏ ఐదో సెమిస్టర్‌ పూర్తిచేశాను. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రాజెక్టు చేయడానికి మంచి ఇన్‌స్టిట్యూట్‌ ఏదో సలహా ఇవ్వండి

ప్రాజెక్టు లేదా ఇంటర్న్‌షిప్‌ల కోసం శిక్షణ సంస్థల్లో చేరకండి. ఇలాంటి 'కాపీ- పేస్ట్‌' ప్రాజెక్టుల వల్ల మీకెలాంటి ఉపయోగమూ ఉండదు. ఏదైనా స్టార్ట్‌అప్‌ లేదా ఎదుగుతున్న కంపెనీలో మీరు ఎంచుకున్న దానిపై ప్రాజెక్టు కోసం ప్రయత్నించండి. http://hyderabad.startupweekend.org/, http://blog.internshala.com/ సైట్లలో మీకు కావలసిన వివరాలు చూడొచ్చు.

నేను ఇపుడు B.Tech. CSE 3వ సంవత్సరం చేస్తున్నాను. నాకు Finance & Trading రంగం ఇష్టం. అందుకే MBAపరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎలా ఈ రంగంలో మెరుగుపడాలో చెప్పండి.

మీరు http://in.groups. yahoo.com/group/AlgorithmicTrading Jobs/ లాంటి గ్రూపులో చేరితే Finance & Trading గురించి చాలా విజయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు Estee Advisers Pvt Ltd లాంటి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా దీనికి సంబంధించిన కోర్సులు చేయాలంటేhttp://iomaorissa.ac.in/ongoingprojects.phpని చూసి కోర్సు వివరాలు పొందండి.

MCA 2011లో పూర్తి చేశాను. కానీ MCAచేసినందుకు ఇపుడు చింతిస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రోగ్రామింగ్‌ అసలిష్టం లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు వృథా. దయచేసి ఇపుడు ఏం చేయాలో సలహా ఇవ్వండి.

మీలా చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ వల్ల జీవన ప్రగతి ఉంటుంది అని నమ్ముతుంటారు.Connect The Dots by Rashmi Bansal (http://goo.gl/ncJwp) అనే పుస్తకం చదవండి. డిగ్రీ, సర్టిఫికేట్ ఎలాంటి CVలేకుండా ఎంతమంది వాళ్ళకి నచ్చిన రంగంలో విజయాలు సాధిస్తున్నారో తెలుస్తుంది. ఇంతకుముందు చదివినదాని గురించి ఆలోచిస్తూ మీకు నచ్చింది చేయడం మానకండి. మీ గమ్యస్థానాన్ని ఒకే ప్రదేశానికి నిర్దేశించుకోవద్దు.Connect The Dots లో చెప్పినట్టుగా ఒక కుర్రాడు గదులను శుభ్రపరచడం దగ్గర నుంచి పేరుతో Dosa Plaza అనే 100 restaurantను స్థాపించి న్యూజీలాండ్‌ దాకా విస్తరించడం చదివితే మీకే అర్థమవుతుంది.

Pages