గ్రూపు ఏదైనా కోర్సు మీకే! - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్



పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!



కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Wednesday

గ్రూపు ఏదైనా కోర్సు మీకే!

ఇంటర్మీడియట్‌ ఒక గ్రూప్‌తో పూర్తిచేసిన తర్వాత ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా అదే సబ్జెక్టులతో సాగిపోవాలా... మరో మార్గం లేదా అనే ఆందోళన చాలామందికి ఎదురవుతుంది. అలా బాధపడాల్సిన పనిలేదు. అన్ని గ్రూప్‌ల వాళ్లు చేరగలిగిన విలువైన కోర్సులు కొన్ని ఉన్నాయి. చేయగలమా అనే భయం కూడా అవసరం లేదు. ఎవరైనా కొద్దిపాటి శ్రమతో పట్టా పుచ్చుకోవచ్చు.
ఇంటర్‌లో తెలిసో తెలియకో తీసుకున్న కోర్సుల పట్ల ఇష్టం లేకపోయినా లేదా కొత్త అభిరుచుల మేరకు మరో మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్న అభ్యర్థులకు కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌లో ఉత్తీర్ణులైనప్పటికీ ఈ కోర్సుల్లో చేరవచ్చు. సంబంధిత నోటిఫికేషన్లు వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తి 
సమాజంలో మంచి గౌరవాన్ని పొందే ఉపాధ్యాయ వృత్తిపట్ల ఆసక్తి ఉంటే ఇంటర్లో ఏ గ్రూప్‌ వారైనా డీఈఈ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) సెట్‌కు హాజరు కావచ్చు. ప్లస్‌టూలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ సెట్‌ రాసుకోవడానికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు కళాశాలలు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వం నిర్వహించే సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాల పరీక్షకు హాజరవడానికి అర్హత పొందుతారు. ఇందులో ప్రతిభను ప్రదర్శిస్తే ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించవచ్చు.
న్యాయవిద్యకూ మార్గం 
న్యాయవిద్య లక్ష్యంగా ఉన్నవారు ఇంటర్‌ నుంచే తమ కలను సాకారం చేసుకోవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి లాసెట్‌, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశానికి క్లాట్‌, ప్రైవేటు సంస్థల్లో అడ్మిషన్లకు ఎల్‌శాట్‌ మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిలో తగిన ర్యాంకు సంపాదిస్తే ఇంటర్‌ విద్యార్థులు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు.
క్లాట్‌: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) ఆధారంగా 19 న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు ఉంటాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునిక కరిక్యులమ్‌, మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం వల్ల నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. క్లాట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో నల్సార్‌ (హైదరాబాద్‌), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణులైనవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

లాసెట్‌: రాష్ట్రస్థాయిలో న్యాయవిద్యలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ / తెలంగాణ రాష్ట్రాల్లో లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (లాసెట్‌) పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. దీని ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల న్యాయవిద్య కళాశాలల్లో చేరవచ్చు. ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే లాసెట్‌ రాయడానికి అర్హత లభిస్తుంది.
ఉపాధికి దారి ఫుట్‌వేర్‌ 
పాదరక్షల సంబంధిత కోర్సుల కోసం దేశంలో రెండు ప్రముఖ సంస్థలు వెలిశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి కాగా మరొకటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజ్‌ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఈ రెండు సంస్థల్లోనూ ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎఫ్‌డీడీఐ: పాదరక్షల తయారీలో మానవ వనరులను అభివృద్ధి చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ)ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ఉన్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు.
సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై: ఇంటర్‌ అర్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ మ్యానుఫ్యాక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఏడాది వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.
విదేశీ భాషలతో అవకాశాల విస్తరణ 
ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. దీనికి లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి.
కోర్సులు, అర్హతలు: ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌) కోర్సులు ఉన్నాయి. అర్హత ఇంటర్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు భరించడానికి నెలకు రూ.వెయ్యి స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఉస్మానియాతో సహా పలు యూనివర్సిటీలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి.
దర్జాగా దూరవిద్య 
కాలేజీలకు వెళ్లి డిగ్రీలు చదువుకోవడానికి వీలు లేనివారు ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి. లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరడమే శ్రేయస్కరం. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కళాభిరుచికి ఫైన్‌ఆర్ట్స్‌ 
ఇంటర్‌ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేయవచ్చు. పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌ మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి.
టాటాలు... ప్రేమ్‌జీలు
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఏ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా ఈ కోర్సులో చేరవచ్చు.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ - బీఏ సోషల్‌ సైన్సెస్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. కాలవ్యవధి మూడేళ్లు. ఈ కోర్సులను టిస్‌ ముంబయి క్యాంపస్‌తోపాటు హైదరాబాద్‌, గువాహటి, తుల్జాపూర్‌ కేంద్రాల్లో నిర్వహిస్తోంది. ఇక్కడ యూజీ కోర్సుల్లో చేరినవాళ్లు కావాలనుకుంటే పీజీ కూడా అదే క్యాంపస్‌లో పూర్తిచేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.
మరిన్ని 
ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌లో చేరినప్పటికీ సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు. ఏడాదికి రెండుసార్లు అవకాశం కల్పిస్తారు. బీబీఎం, బీబీఏ తోపాటు పలు కోర్సుల్లో ఇంటర్‌ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సంస్థ అందిస్తోంది. ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు కోర్సుకి అర్హులు.
ఆతిథ్య రంగంలోకి... 
ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవాళ్లు, పాకశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణ నైపుణ్యం కలిగినవారు, శుభ్రంగా ఉంచటాన్ని ఇష్టపడేవారు...వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ రంగంలో సమర్థ మానవ వనరులకు గిరాకీ ఉంది.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)లు ఆతిథ్య రంగంలో ఉత్తమ విద్యాబోధనకు పేరుపొందిన సంస్థలు. ఇవి కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈ సంస్థలను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) పర్యవేక్షిస్తుంది. ఇవి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తున్నాయి. జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో రెండు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌. ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు అందిస్తున్నాయి. వీటిలో దాదాపు అన్నింట్లోనూ నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్సులకు అర్హులే.
సృజనకు పట్టం డిజైన్‌ 
ఇంటర్‌ తర్వాత ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్‌ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
నిఫ్ట్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్స్‌: యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌
ఎన్‌ఐడీ: ఇందులో ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి.
యూసీడ్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ సంక్షిప్త రూపమే యూసీడ్‌. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు మరికొన్ని ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డీఈఎస్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు చేసుకోవచ్చు. ప్రవేశం కల్పించే ముఖ్య సంస్థల్లో ఐఐటీ-బాంబే, గువాహటి; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - కోక్రాజ్హర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - డెహ్రాడూన్‌ తదితరాలు ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
ఇంటర్‌ తర్వాత బీఎడ్‌, ఎంఏ, ఎంబీఏ మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదివే అవకాశం ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు సహా పలు యూనివర్సిటీల్లో ఇంటర్‌ ఉత్తీర్ణతతోనే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో చేరవచ్చు.

ఐఐఎం, ఇండోర్‌: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సును ఐఐఎం-ఇండోర్‌ అందిస్తోంది. ఈ తరహా కోర్సును అందిస్తోన్న ఏకైక సంస్థ ఐఐఎం-ఇండోర్‌ ఒక్కటే కావడం విశేషం. కోర్సులో 120 సీట్లు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పదోతరగతి, ఇంటర్‌ల్లో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55) శాతం మార్కులు సాధించినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఐటీ, మద్రాస్‌: ఐఐటీ-మద్రాస్‌ 2006లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను బోధిస్తున్నారు. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థులను చేర్చుకుంటారు.
ఆర్‌ఐఈ, మైసూర్‌: ఇంటర్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్‌ నాలుగేళ్ల కోర్సులు చదువుకోవచ్చు. పలు సంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఆర్‌ఐఈ మైసూరులో బీఏఎడ్‌ కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. రాతపరీక్షలో సాధించిన మార్కులకు 60 శాతం, అకడమిక్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మే 9 వరకు పంపవచ్చు.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌; ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఈ కోర్సులకు ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు మే 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీయూ సెట్‌: ఇంటర్‌ అర్హతతోనే కొత్తగా ఏర్పడిన పది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌; ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ: ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌; ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీలతోపాటు బీఏ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ స్టడీస్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, బీపీఏ: మ్యూజిక్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌లో డిప్లొమా, క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ కోర్సులు ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రా, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర...ఇలా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి యూనివర్సిటీ ఏదో ఒక సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందిస్తున్నాయి.

Pages