ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను.? - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్



పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!



కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Friday

ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను.?

* ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. డేటా సైన్స్‌ లేదా మెషిన్‌ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ కోర్సు చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? విదేశాల్లో అందించే సంస్థలనూ తెలపండి. - యాసాని చంద్రశేఖర్‌

బిగ్‌ డేటా, సమాచార విప్లవంతో డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో పరిశోధన, ఉద్యోగావకాశాలకు గిరాకీ ఏర్పడింది. మనదేశంలో ప్రఖ్యాత ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐఎంలు ఈ విభాగంలో పరిశోధనకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా యూఎస్‌ఏలోని ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీ మెలన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు జీమ్యాట్‌, టోఫెల్‌, ఉద్యోగానుభవం ఆధారంగా చేసుకుని పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

ఎంఎస్‌సీ (జాగ్రఫీ) చేశాను. టౌన్‌ ప్లానింగ్‌ కోర్సులు చేయాలనుంది. వీటిని అందించే విశ్వవిద్యాలయాలతోపాటు అర్హత, నోటిఫికేషన్ల సమాచారాన్నీ అందించండి.? - శ్రీను

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ వ్యవస్థ ఉన్నది మనదేశంలోనే. 2025 నాటికి దేశంలో సగం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని ఒక సర్వే తెలియజేస్తోంది. మితిమీరిన పట్టణీకరణ రవాణా, పేదరికం, నిరుద్యోగం, మురికివాడలు, అనధికార గృహ కాలనీలు వంటి వివిధ సవాళ్లను ముందుకు తీసుకొస్తోంది. టౌన్‌ ప్లానర్‌ ముఖ్య విధి- వైవిధ్యంగా, అందరికీ అనుకూలమైన నగర ప్రణాళికను రూపొందించడమే.
కోర్సుల విషయానికొస్తే.. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వారు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నారు. ద గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌ వారు ఎంఎస్‌సీ ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ కోర్సును అందిస్తున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు ఈ కోర్సులు చదవడానికి అర్హులు. మరిన్ని వివరాలకు ignou.ac.in ను సందర్శించవచ్చు.

ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా నాకున్న అవకాశాలేంటి? - టి. శిరీష

మీ ప్రశ్నను చూస్తే మీకు ఇష్టంలేని రంగంలో చదువు కొనసాగించారేమో అనిపిస్తోంది. సాధారణంగా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటారు. వేరే వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి, మీరు బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రయత్నించవచ్చు. అలాగే, ఎస్‌ఎస్‌సీ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. నేర పరిశోధనపై ఆసక్తి, చాకచక్యం, సమయస్ఫూర్తి ఉంటే సీబీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సమాజసేవ పట్ల ఆసక్తి ఉంటే యూపీఎస్‌సీ పరీక్షలు రాసి, సివిల్స్‌ సాధించవచ్చు. వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే.. నలుగురికి ఉపాధిని కల్పించినవారూ అవుతారు. ముందుగా మీకు ఆసక్తి దేనిలో ఉందో ఆ రంగాన్ని ఎంచుకుని దానిలో నైపుణ్యాన్ని సాధించండి. ఉద్యోగావకాశాలు వాటంతటవే కనిపిస్తాయి.

బీటెక్‌ పూర్తిచేశాను. ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. పూర్తయ్యాక కోర్సులేమైనా చేస్తే మేలా? నాకున్న ఉద్యోగావకాశాలేంటి? నాకున్న స్వదేశీ, విదేశీ విద్య, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

ప్రతి మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లకు టూల్స్‌ జీవనాడి లాంటివి. ఎక్కువ పని సామర్థ్యం, నాణ్యత, తక్కువ ఖర్చుతో పని సాధ్యం చేసే టూల్స్‌ సర్వత్రా అవసరం. కానీ ఈ విభాగంలో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు చేయగలిగేవారికి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. మీరు రెండో సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ముందుగా ఏదైనా సంస్థలో ప్రాజెక్టు వర్క్‌ చేయడం ద్వారా పని అనుభవాన్ని పొందండి. ఈ రంగంలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు ఆదరణ ఉంటుంది. కాబట్టి చదువుతోపాటే కొంత పని అనుభవాన్ని పొందినట్లవుతుంది. సాధారణంగా ఐఐటీలు, నిట్‌ల్లో ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) చేసినవారికి మంచి వేతనం, భవిష్యత్తు ఉంటుంది. మీకు ఆటోమొబైల్‌, మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లలో టైల్‌ డిజైనర్‌, టూల్‌ డిటైలర్‌, స్పేర్‌ పార్ట్‌ డిజైనర్‌, ప్రొడక్ట్‌ డిజైనర్‌, కాస్ట్‌ ఇంజినీర్‌, డ్రాఫ్టింగ్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉన్నతవిద్య దృష్ట్యా దేశవిదేశాల్లో పీహెచ్‌డీని అభ్యసించే అవకాశం ఉంది.

మా అమ్మాయి బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. తను ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అర్హురాలేనా?

ఈఎన్‌టీ చెవి, ముక్కు, గొంతు రుగ్మతలకు సర్జరీ, చికిత్స అందించే శాస్త్రం. ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవాలనుకునేవారు ఎంబీబీఎస్‌తోపాటు సంవత్సరంపాటు ఏదేని ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవేశపరీక్ష ద్వారా ఎంఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. కాబట్టి బీడీఎస్‌ చదువుతున్నవారు ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అవకాశం లేదు.

ఎంటెక్‌ 70 శాతం మార్కులతో ఐదేళ్ళ క్రితం పూర్తిచేశాను. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, బ్యాంకు, సివిల్స్‌ పోటీపరీక్షలు రాశాను. ఒకటి రెండు మార్కుల తేడాతో అన్నీ చేజారాయి. ప్రస్తుతం గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాను. కష్టపడి చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతున్నట్లనిపిస్తుంది. భవిష్యత్తుపై నిరాశగా, భయంగా ఉంది. నేనేం చేస్తే మంచిదో సలహా ఇవ్వగలరు.

జీవితంలో విజయం సాధించడానికి ఏకాగ్రత, తదేక దీక్ష అనేవి అత్యవసరం. మీరు ఒకటి రెండు మార్కుల తేడాతో మాత్రమే పోటీపరీక్షల్లో వెనకబడుతున్నారు. అంటే విజయానికి చాలా దగ్గర్లో ఉన్నారనేగా అర్థం! ఒక్కో అడుగు వేస్తూ ఇంతదూరం ప్రయాణం చేసి గెలుపునకు అతి కొద్దిదూరంలో ఉన్న మీరు ఆ అడుగును మందుకు వేయండి! వెనక్కి వేయడం వల్ల మీ శ్రమా, కష్టం వృథా అవుతాయే తప్ప లక్ష్యం చేరుకోలేరు.
సహనం పాటించేవారే జీవితంలో అనుకున్నవి సాధించగలరు. గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం చేజిక్కించుకుంటారు.
ప్రపంచంలోని గొప్పవాళ్ళు ఎందరో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. ఎవరూ ఒక్కరోజులోనో, స్వల్పకాలంలోనో గొప్పవారు కాలేరు. కిందపడ్డా ప్రయత్నం సాగిస్తేనే విజయం వరిస్తుంది. మీ లక్ష్యసాధనకు ఇది తొలిమెట్టు అనుకుని ముందుకు సాగండి. అంతేకానీ... నిరాశ, నిస్పృహలతో సాధించేది ఏదీ ఉండదు.
మీరు పరీక్ష సమయం వచ్చేసరికి టెన్షన్‌ పడి పరీక్ష సరిగా రాస్తానో లేదో అనే భయానికి లోనవుతున్నారు. దానివల్ల చదివినది మర్చిపోయి పరీక్ష సరిగా రాయలేకపోతున్నారు. విజయానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ ధీమాతో ముందుకు వెళ్ళండి. అనుకున్నది తప్పకుండా సాధించగలరు. భవిష్యత్తు గురించి ఆందోళన పడకండి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే తప్పకుండా ఉన్నతస్థానంలో ఉంటారు. అప్పుడు మీ గతంలోని చిక్కులూ, కష్టాలను తలచుకుని ఉల్లాసపడతారు కూడా.
‘మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి’ అని అబ్దుల్‌ కలామ్‌ చెప్పారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని విజయం కోసం ప్రయత్నించాలి. సవాలు ఎదురైనపుడు మన ప్రతిభను చూపించే అవకాశంగా భావించాలి. అంతేకానీ కుంగిపోకూడదు.
మీరు ఇతర ఉద్యోగాలకు కూడా ప్రయత్నించి చూడండి. మీ చదువుకు మీకు సరిపోయే ఉద్యోగానికి అవకాశం ఉన్నట్లయితే ప్రయత్నించండి. మీ అనుభవమూ, తెలివితేటలూ అక్కడ ఉపయోగపడవచ్చు. ఒక అవకాశం చేజారితే కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. మరో అవకాశం కోల్పోకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు ఎదురవుతాయోనని భయపడుతూ బతికితే జీవితంలోని ఆనందానికి దూరం కావాల్సివస్తుంది. గెలవకపోవటం ఓటమి కాదు; మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి!

మా అబ్బాయి వీఐటీ యూనివర్సిటీ (వెల్లూరు)లో ఎం.ఎస్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు) చదువుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ డిగ్రీని అంగీకరిస్తారా? ఈ కోర్సు ఎంటెక్‌కు సమానం కాదట. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి అర్హత ఉంటుందా?

కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్‌ కోర్సు చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. ఒకవేళ కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో ప్రత్యేకంగా నాలుగు సంవత్సరాల బీటెక్‌, రెండు సంవత్సరాల ఎంటెక్‌ అర్హత ఉండాలని ఇచ్చినప్పుడు మాత్రమే అర్హత ఉండదు. కానీ, చాలావరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) స్కోరును కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నారు.
మీ అబ్బాయిని గేట్‌ రాయించడానికి ప్రయత్నించండి. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి పదహారు సంవత్సరాల విద్యను అభ్యసించి ఉండాలి. మీ అబ్బాయి 10+2+5 చదివారు కాబట్టి యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి అతడికి అర్హత ఉంటుంది. అందుకు జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌), ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టులైన టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లలో అర్హత సాధించటం అవసరం.

ఎంఎస్‌సీ చేశాను. డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలనూ తెలపండి.

డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులు వైవిధ్యమైనవి. ఈ కోర్సులను భారతదేశంలో కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్‌ డైమండ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ, జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన సంస్థలు డైమండ్‌, జెమాలజీకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.
డైమండ్‌, జెమాలజీకి సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్‌ జువెల్లరీ ప్రొఫెషనల్‌ కోర్సు, ప్రొఫెషనల్‌ డైమండ్‌ గ్రేడర్‌ కోర్సు, జువెల్లరీ డిజైన్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జువెల్లరీ మాన్యుఫాక్చరింగ్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జెమాలజీ ప్రొఫెషనల్‌ కోర్సు మొదలైనవి ఉన్నాయి. డిప్లొమా కోర్సులైన డైమండ్స్‌ అండ్‌ డైమండ్‌ గ్రేడింగ్‌, కలర్డ్‌ జెమ్‌స్టోన్‌ ఐడెంటిఫికేషన్‌, పాలిష్‌ డైమండ్‌ గ్రేడింగ్‌ లాంటి స్వల్పకాలిక కోర్సులు కూడా ఉన్నాయి.
ఈ కోర్సులు చేసినవారికి జువెలరీ తయారీ, డిజైన్‌ రంగంలో, జెమ్స్‌ ఎగుమతి చేసే సంస్థల్లో, జువెలరీ వ్యాపార సంస్థల్లో, జెమొలాజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉత్పత్తి చేసే రంగంలో, జెమ్‌స్టోన్‌ టెస్టింగ్‌ లేబొరేటరీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. జెమలాజిస్టులకు ఈరోజుల్లో ఉద్యోగావకాశాలకు కొరతలేదు. ఈ కోర్సులు చదివినవారికి జెమ్స్‌, జువెలరీ రంగంలో జెమాలజిస్టులు, జువెలరీ డిజైనర్‌, డైమండ్‌ గ్రేడర్‌, సేల్స్‌ సిబ్బంది, జెమ్‌స్టోన్‌ ఆక్షన్‌ మేనేజర్లుగా మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలుంటాయి.

మా అమ్మాయి బీటెక్‌ (ఈఈఈ) చేసి ప్రస్తుతం ఎంటెక్‌ (వీఎల్‌ఎస్‌ఐ) చేస్తోంది. బీహెచ్‌ఈఎల్‌, ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగం సాధించాలంటే గేట్‌, నెట్‌లలో అర్హత సాధిస్తే సరిపోతుందా? ఇంకేమైనా పరీక్షలు రాయాల్సి ఉంటుందా?

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ/ తగిన ఉద్యోగాల భర్తీల కోసం వారు ప్రకటించే నోటిఫికేషన్‌ కోసం ఇస్రో (లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)- www.lpsc.gov.in/www.nrsc.gov.in/Work_With_Us_careers.html, www.bhel.com/jobs/jobs.php వెబ్‌సైట్లను గమనిస్తుండండి. యూజీసీ (నెట్‌) వారి 2013 ప్రకటన ప్రకారం ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ప్రభుత్వరంగ అధీనంలోని ఉద్యోగాలకు అర్హతగా ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి పీఎస్‌యూలలో గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లని తీసుకుంటారు. బీటెక్‌లో 65% మార్కులతోపాటు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని దరఖాస్తు చేసుకున్న తరువాత వారు నిర్వహించే రాతపరీక్ష, వ్యక్తిగత మౌఖికపరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఎంటెక్‌ (ఈసీఈ) కమ్యూనికేషన్‌ & సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ స్పెషలైజేషన్‌లో ఇటీవలే పూర్తిచేశాను. ఈ రంగంలో నాకున్న ఉద్యోగావకాశాలను తెలపండి?

సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ వాడకం అన్ని దేశాల్లో పెరుగుతున్నందున ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో అనలాగ్‌ సిగ్నల్‌, డిజిటల్‌ సిగ్నల్‌, స్టాటిస్టికల్‌ సిగ్నల్‌, ఆడియో సిగ్నల్‌, స్పీచ్‌ సిగ్నల్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, వీడియో సిగ్నల్‌, అర్రే సిగ్నల్‌ ప్రాసిసెంగ్‌ ఉంటాయి. దీనిలో అవకాశాల కోసం అసెంబ్లీ లాంగ్వేజ్‌, సీ, సీ++ లో మంచి అవగాహన, రియల్‌ టైం ప్రోగ్రామింగ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఆల్గరిథమ్స్‌, టైం కన్స్‌ట్రైన్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉండాలి. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ముఖ్యంగా డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఆదరణ ఉంది. దీనిలో ఉద్యోగావకాశాలకు, ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయని నాస్కామ్‌ వారు తెలిపారు. డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌కు నెంబర్‌, గణితంలో ప్రావీణ్యం ఎంతో అవసరం. ఇంకా స్పీచ్‌ గుర్తింపు (రికగ్నిషన్‌), కమ్యూనికేషన్‌, కన్వర్జన్స్‌లో పరిశ్రమ ముందుకు వెళ్తోంది. మీకు టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, మోటరోలా, ల్యూసెంట్‌, అనలాగ్‌ డివైజెస్‌, ఇంటెల్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

మెషీన్ డిజైన్‌లో ఎంటెక్ చేశాను. డిజైనింగ్ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. వివరాలు, దరఖాస్తు విధానం తెలుపగలరు?

ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు మాన్యుఫాక్చరింగ్ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. మెషీన్ డిజైన్‌కు సంబంధించి సీపీడబ్ల్యూడీ, డిఫెన్స్, పీబ్ల్యూడీ, ఇతర మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రైల్వే, కెమికల్, పవర్ ప్లాంట్, ఏరోనాటికల్ సంస్థలు తీసుకుంటాయి. వివిధ ఉద్యోగ పోర్టళ్లు (http://bit.ly/1qvxabqhttp://bit.ly/1x1oZ3jhttp://bit.ly/1vrbrCOhttp://bit.ly/14OBRDm) లో పొందుపరచిన ఉద్యోగావకాశాలను చూసి మీకు సరిపడే ఉద్యోగానికి రెజ్యుమెను అప్లోడ్ చేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంకా లింక్‌డిన్ (http://linkd.in/1ud1dij) లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తగిన సంస్థలను వెతకవచ్చు. ఆ సంస్థల వెబ్‌సైట్లు చూసి, ఈ-మెయిల్/ ఫోను ద్వారా నేరుగా/ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తు చేయడమే కాకుండా దాని స్థితి(స్టేటస్)ని ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండండి.

బీటెక్‌ (ఈఈఈ) 2012లో 85%తో పూర్తిచేశాను. ప్రస్తుతం ఎంటెక్‌ చేస్తున్నాను. తరువాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. భారత్‌, యూఎస్‌లలో పీహెచ్‌డీ అవకాశాలున్న విశ్వవిద్యాలయాలేవి? స్కాలర్‌షిప్‌ పొందే అవకాశాలేమైనా ఉన్నాయా?

ఎంటెక్‌ తర్వాత పీహెచ్‌డీ చేయడం సరయిన ఎంపికే. ముందుగా వీటిలో ఒక సబ్జెక్టును ఎంచుకోండి. ఇండస్ట్రియల్‌& కమర్షియల్‌ పవర్‌ సిస్టమ్స్‌, మోటార్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్స్‌ , పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ క్వాలిటీ, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, పవర్‌ సిస్టమ్‌ ఎకనామిక్స్‌, మార్కెట్స్‌ & రెగ్యులేషన్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ కమ్యూనికేషన్స్‌, పవర్‌ సిస్టం రిలేయింగ్‌ & ప్రొటెక్షన్‌, పవర్‌ సిస్టం స్టెబిలిటీ &కంట్రోల్‌, పవర్‌ సిస్టం ట్రాన్సియేంట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & మెజర్‌మెంట్‌, పవర్‌ సిస్టం ఆపరేషన్స్‌, ప్లానింగ్‌ & రిలయబిలిటీ, ఫొటోవోల్టాయిక్స్‌, విండ్‌, రెన్యువబుల్స్‌, స్మార్ట్‌ గ్రిడ్స్‌, సబ్‌స్టేషన్‌ డిజైన్‌, ట్రాన్స్‌మిషన్‌ &డిస్ట్రిబ్యూషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక్‌ మెషినరీ, ఎనర్జీ కన్వర్షన్‌, ఎనర్జీ డెవలప్‌మెంట్‌ & పవర్‌ జనరేషన్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ సిస్టం డిజైన్‌, హై ఓల్టేజ్‌ ఏసీ/డీసీ, ఫాక్ట్స్‌. వివిధ విశ్వవిద్యాలయాలు ఫెలోషిప్‌/ స్కాలర్‌షిప్‌, ఫండింగ్‌ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. ఇక పీహెచ్‌డీ అందించే విశ్వవిద్యాలయాలు ఐఐటీ, ఎన్‌ఐటీలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల వివరాలకు http://bit.ly/1128Y4n

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ చేశాను. విదేశీ విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ చేయాలనుకుంటున్నాను. విశ్వవిద్యాలయాలు, అర్హత ఉద్యోగ వివరాలను తెలియజేయగలరు?

మొదటగా ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌, ఓవర్సీస్‌ కెరియర్‌ ఒకటి కాదని తెలుసుకోండి. పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రతి విశ్వవిద్యాలయం వారికీ వారి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌తో పాటు మీ ప్రొఫైల్‌ను, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, జీఆర్‌ఈ/ టోఫెల్‌ స్కోరు, రికమండేషన్‌ లెటర్స్‌ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (www.cse.ucsd.edu/node/193), నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (www.nus.edu.sg), స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ (http://stanford.io/1t7jyDo), ఎంఐటీ (http://web.mit.edu/) లాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రయత్నించండి. ఉపకారవేతనం అందించే విశ్వవిద్యాలయాల వివరాలకు ఈ వెబ్‌సైట్‌ http://bit.ly

ఎంఎస్సీ (సీఎస్‌) తరువాత ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. ఏఐసీటీఈ ప్రకారం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హురాలినేనా? యూజీసీ నెట్‌లో అర్హత సాధిస్తే భారత్‌లో ఏ కళాశాలలోనైనా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరొచ్చా?

నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను సంవత్సరానికి రెండు సార్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్వహిస్తారు. దీనికి మాస్టర్‌ డిగ్రీలో 55% ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. కాబట్టి మీరు దీనికి ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌ రాస్తే ఉద్యోగం వస్తుందని కాదు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం సంపాదించడానికి కనీస అర్హత. ఇది సాధించిన తర్వాత ఆయా కళాశాలలు ఖాళీల గురించి వార్తాపత్రికల్లో/ ఇతర మీడియాలో ప్రకటిస్తారు. దానికి దరఖాస్తు చేసుకుని వారు నిర్వహించే రాత పరీక్షలు/ ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం సంపాదించవచ్చు. యూజీసీ- నెట్‌ నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు http://ugcnetonline.in/ ను అనుసరించండి.

ఎంటెక్‌ (అడ్వాన్స్‌డ్‌ పవర్‌ సిస్టమ్స్‌) 2013లో పూర్తిచేశాను. ఫీల్డ్‌ డిజైనింగ్‌/ కోర్‌ కంపెనీల్లో మెయింటెనెన్స్‌ ఉద్యోగం చేయాలనుంది. వీటి ఇంటర్న్‌షిప్‌, ట్రైనింగ్‌ కోర్సుల వివరాలు తెలుపండి.

ఇంటర్న్‌షిప్‌ల కోసం http://bit.ly/1jll5Ldhttp://internshala.comwww.letsintern.com లను అనుసరించండి. ఈ వెబ్‌సైట్‌ను చూసి http://bit.ly/1pKg3hz మీకు నచ్చిన కంపెనీలకు దరఖాస్తు చేసుకోండి. ఫీల్డ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాముల కోసం http://bit.ly/1n6WoWE చూడండి. ఇదే కాకుండా మీరు క్రితం శీర్షికల్లో చెప్పినవిధంగా గూగుల్‌ అలర్ట్స్‌ను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఫీల్డ్‌ డిజైనింగ్‌/ కోర్‌ కంపెనీల్లో మెయింటెనెన్స్‌ ఉద్యోగంపై అప్‌డేట్స్‌ పొందవచ్చు.

మా బాబు ఎంటెక్‌ (బయో ఇన్ఫర్మాటిక్స్‌) చేస్తున్నాడు. తరువాత బయోఇన్ఫర్మాటిక్స్‌పై పీహెచ్‌డీ చేయవచ్చా? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కంప్యూటర్స్‌, జీవశాస్త్ర సమస్యల సాధనలపై ఆసక్తి ఉన్నవారు బయోఇన్ఫర్మాటిక్స్‌ చేయవచ్చు. దీనిలో రెండు ముఖ్యాంశాలుంటాయి. మొదటిది- పరికరాలు కనుగొని వాటితో జీవశాస్త్రజ్ఞుల కోసం సమాచారం విశ్లేషించడం. రెండోది- కంప్యూటర్‌ సాంకేతికతను ఉపయోగించి జీవశాస్త్ర పరిశోధన చేయడం (కంప్యూటేషనల్‌ బయాలజీ). శాస్త్రవేత్త కావాలనుకునేవారు పీహెచ్‌డీ చేయడం మంచిదే. అయితే పీహెచ్‌డీ కేవలం సర్టిఫికెట్‌ కోసం కాకుండా శాస్త్రప్రపంచానికీ, సమాజానికీ ఏమివ్వబోతున్నారనేది ముఖ్యం. పరిశ్రమలో అయితే సీనియర్‌ స్థాయి చేరేవరకు అనుకున్నంతగా ఎదుగుదల ఉండకపోవచ్చు. అదే అకాడమిక్‌ రంగంలో అయితే మొదట్లో ఎన్ని పేపర్లు సమర్పించారన్నది ముఖ్యం. అదే గ్రూప్‌ లీడర్‌ అయ్యాక గ్రాంట్స్‌కు దరఖాస్తు చేసి ఎంత రాబట్టగలిగావన్న దానిపైనా ఆధారపడుంటుంది.

ఎంటెక్‌ (ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజినీరింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. సోలార్‌ ప్లాంట్‌ ప్రాముఖ్యం, నిర్మాణానికి సహకరించే వెబ్‌ వనరుల వివరాలు తెలుపగలరు.

ప్రభుత్వం 2010లో తలపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) ముఖ్య ఉద్దేశం 2022 సంవత్సరానికల్లా 20 గిగావాట్స్‌ ఉత్పత్తిని చేరుకోవడం. దీనికి తోడుగా భారత్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సౌరవిద్యుత్తు ప్లాంటును 30వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాజస్థాన్‌లో నిర్మించనుంది. ఈ మధ్యే అతిపెద్ద సోలార్‌ ప్లాంటును మధ్యప్రదేశ్‌లో స్థాపించారు. రోజురోజుకు విద్యుత్తుకు గిరాకీ పెరుగుతున్నకొద్దీ తక్కువ ఖర్చుతో సౌరవిద్యుదుత్పత్తిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి మీరు దీనిలో మీ కెరియర్‌ మొదలుపెట్టడం మంచి ఆలోచనే. ఈ వెబ్‌సైట్‌ http://bit.ly/1i7jA50http://yhoo.it/1ly2bHmhttp://bit.ly/1naEblKల నుంచి సౌరవిద్యుదుత్పత్తి గురించి తెలుసుకోండి.

ఎంటెక్‌ (డీఈసీఎస్‌) 2010లో పూర్తిచేశాను. తరువాత వీఎల్‌ఎస్‌ఐ (ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌) కోర్సు చేశాను. కానీ, ఫ్రెషర్‌ కావడంతో వీఎల్‌ఎస్‌ఐపై ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌/ సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను. మంచి కెరియర్‌లో స్థిరపడడానికి ఏ కోర్సులు చేయాలో తెలపండి. ప్రోగ్రామింగ్‌/ కోడ్‌ డెవలపర్‌పై ఆసక్తి లేదు.

వీఎల్‌ఎస్‌ఐలో ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌ చేసి ఉన్నారు కాబట్టి ప్రోగ్రామింగ్‌పై ఇష్టం లేకపోయినా వెరిఫికేషన్‌/ టెస్టింగ్‌ ఇంజినీర్‌లో మీ కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఫ్రెషర్‌ అనే భావన పోవడానికి మీరు ఇంటర్న్‌షిప్‌ చేయడం లాభదాయకం. దీంతో మీకు వీఎల్‌ఎస్‌ఐలో నైపుణ్యం మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్‌, కెరియర్‌పై ఇతర సందేహాలకు mentor@rrembed labs.comకి మీ CVని పంపి వారు నిర్వహించే ఉచిత వర్క్‌షాపునకు హాజరవ్వండి. Intel, Texas instruments, IBM, Philips, Motorola, SGS- Thompson, Mentor Graphics & Cirrus Logic వంటి బహుళజాతి సంస్థలు ఇదివరకే భారత్‌లో తమ అభివృద్ధి కేంద్రాలు స్థాపించాయి. ఇవేకాకుండా కింద తెలిపిన వీఎల్‌ఎస్‌ఐకి సంబంధించిన మరిన్ని కంపెనీల వివరాలు, తెలుసుకోండి.

ఎంటెక్‌ (ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాను. రెండో సంవత్సరం ప్రాజెక్టును విదేశాల్లో చేద్దామనుకుంటున్నాను. అక్కడ అత్యాధునిక, సాంకేతిక, బోధనా పద్ధతులుంటాయని భావిస్తున్నాను. సలహా ఇవ్వగలరు.

మీరు విదేశాల్లో ప్రాజెక్టు చేయడానికి ఇంటెల్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఫ్రీస్కేల్‌, ఫిలిప్స్‌, శామ్‌సంగ్‌, ఎల్‌జీ వంటి వాటిలో ప్రయత్నించండి. భారత్‌లో ప్రాజెక్టుకి Tata Elxsi/ Sasken, Ittiam, Infosys, KPIT, HCL, Mphasis, Symphony మొదలైనవాటిలో కూడా ప్రయత్నించండి. వీఎల్‌ఎస్‌ఐ కంపెనీ వివరాల గురించి ఈ వెబ్‌లింక్‌ http://bit.ly/1eS3hFjని చూడండి. నచ్చిన కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లి వారి ఇంటర్న్‌షిప్‌/ ప్రాజెక్టుల వివరాలను చదివి దరఖాస్తును నేరుగా పంపవచ్చు. ఈ వెబ్‌లింకు http://careers.ti.com/internని చూసి వివరాలు తెలుసుకోండి.

ఎంటెక్‌ (డీఈసీఎస్‌) 2010లో పూర్తిచేశాను. తరువాత వీఎల్‌ఎస్‌ఐ (ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌) కోర్సు చేశాను. కానీ, ఫ్రెషర్‌ కావడంతో వీఎల్‌ఎస్‌ఐపై ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌/ సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను. మంచి కెరియర్‌లో స్థిరపడడానికి ఏ కోర్సులు చేయాలో తెలపండి. ప్రోగ్రామింగ్‌/ కోడ్‌ డెవలపర్‌పై ఆసక్తి లేదు.

వీఎల్‌ఎస్‌ఐలో ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌ చేసి ఉన్నారు కాబట్టి ప్రోగ్రామింగ్‌పై ఇష్టం లేకపోయినా వెరిఫికేషన్‌/ టెస్టింగ్‌ ఇంజినీర్‌లో మీ కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఫ్రెషర్‌ అనే భావన పోవడానికి మీరు ఇంటర్న్‌షిప్‌ చేయడం లాభదాయకం. దీంతో మీకు వీఎల్‌ఎస్‌ఐలో నైపుణ్యం మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్‌, కెరియర్‌పై ఇతర సందేహాలకు mentor@rrembed labs.comకి మీ CVని పంపి వారు నిర్వహించే ఉచిత వర్క్‌షాపునకు హాజరవ్వండి. Intel, Texas instruments, IBM, Philips, Motorola, SGS- Thompson, Mentor Graphics & Cirrus Logic వంటి బహుళజాతి సంస్థలు ఇదివరకే భారత్‌లో తమ అభివృద్ధి కేంద్రాలు స్థాపించాయి. ఇవేకాకుండా కింద తెలిపిన వీఎల్‌ఎస్‌ఐకి సంబంధించిన మరిన్ని కంపెనీల వివరాలు, తెలుసుకోండి.

ఎంటెక్‌ రాడార్‌ & మైక్రోవేవ్‌ చేసినవారికి ఎక్కడెక్కడ ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలుపండి.

మీకు డీఆర్‌డీవో, నేవీ, ఎయిర్‌ఫోర్సు, ఇస్రో, ఇండియన్‌ మెటలర్జికల్‌ డిపార్ట్‌మెంట్‌, ఎన్‌ఎండీసీ, శాటిలైట్‌/ టెలి కమ్యూనికేషన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సివిల్‌ ఏవియేషన్‌ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు డీఆర్‌డీఓ ఆర్‌ అండ్‌ డిలో వివిధ భాగాలకు Radar- http://bit.ly/1bradYm, మైక్రోవేవ్‌- http://bit.ly/1bsnvqV వెబ్‌సైట్లను చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ల్లో ఇంటర్న్‌షిప్‌ అందించే కంపెనీల వివరాలు తెలుపగలరు.

మీరు ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలు ఉదా: జీఈ/ ఫిలిప్స్‌ లాంటి కంపెనీలలో లేదా http://www.perfinthealthcare.com (chennai) దరఖాస్తు చేసుకోవాలి.
డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ (DSP)లో ఇంటర్న్‌షిప్‌ కోసం క్వాల్‌కామ్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో ఎంబెడెడ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఆధారంగా చేయవచ్చు. ఇవేకాకుండా ఇంటర్న్‌షిప్‌, లెట్‌సింటర్న్‌, గూగుల్‌ అలర్ట్స్‌ ఉపయోగిస్తూ ఇంటర్న్‌షిప్‌ వివరాలు తెలుసుకోండి.

బీటెక్‌ (ఈఈఈ) చేసి, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ పవర్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ పూర్తిచేశాను. కోర్‌ కంపెనీల్లో డిజైనింగ్‌/ నిర్వహణ విభాగాల్లో చేయాలని ఉంది. ఈ అంశాల్లో శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ ఇచ్చే సంస్థల వివరాలు తెలుపగలరు.

ఇంటర్న్‌షిప్‌ కోసం టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లి., హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌, అదాని పవర్‌ లిమిటెడ్‌, జీవీకే, జీఎమ్‌ఆర్‌, కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌ లిమిటెడ్‌. లాంటి కంపెనీల్లో ప్రయత్నించండి. దీని కోసం మీరు లింకెడిన్‌ ద్వారా ఆ కంపెనీ హైరింగ్‌/ టెక్నికల్‌ మేనేజర్‌ని లేదా హెచ్‌ఆర్‌ని సంప్రదించండి.
నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే వివిధ కోర్సుల వివరాలకు www.npti.in వెబ్‌సైట్‌ని చూడండి. www.quora.com లాంటి ఫోరంలో చేరి పవర్‌ సిస్టమ్స్‌ గురించి సందేహాలను వ్యక్తపరుస్తూ నిపుణుల నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.

ఎంటెక్‌ (cad/cam) నాలుగో సెమిస్టర్‌ చదువుతున్నాను. ఈ రంగానికి సంబంధించిన వివరాలు తెలుపగలరు.

ఒక వస్తువు మొదటి దశ నుంచి తయారయ్యే చివరి దశ వరకూ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రక్రియలో నాణ్యతతో కూడిన ఉత్పత్తి తయారీ కోసం CAD/ CAMఎంతో ఉపయోగపడుతుంది. ఎంటెక్‌- CAD/CAM చేసినవారికి ఆర్కిటెక్చరల్‌ డిజైనర్‌, కన్సర్వేషనిస్ట్‌, సర్వేయర్‌, సివిల్‌ ఇంజినీర్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రికల్‌ డిజైనర్‌, ఏరోస్పేస్‌ డిజైనర్‌, మెకానికల్‌ డిజైనర్‌, మాన్యుఫాక్చరింగ్‌ డిజైనర్‌, టీచింగ్‌/రీసెర్చ్‌ల్లో ఉపాధి అవకాశాలుంటాయి. మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్లు (ఇంజినీరింగ్‌ డిజైన్‌, డ్రాఫ్టింగ్‌, ప్రొడక్షన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ / ఆపరేటింగ్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ మెషీన్స్‌), కన్సల్టింగ్‌ ఇంజినీరింగ్‌ ఆఫీసెస్‌ (ప్రొడక్ట్‌ డిజైన్‌, ప్రోటోటైప్‌ డెవలప్‌మెంట్‌, సాలిడ్‌ మోడలింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ స్ట్రెస్‌ అనాలిసిస్‌), ఆర్‌ అండ్‌ డీ సెంటర్లలో ఇలాంటి అవకాశాలను సంపాదించవచ్చు.

బీటెక్‌ (ఈసీఈ) తరువాత ఎంటెక్‌ (వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్‌ డిజైన్‌) 2013లో పూర్తి చేశాను. కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐల్లో ఏది ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది?

ఇదివరకే పీజీ చేశారు కాబట్టి వీఎల్‌ఎస్‌ఐపై మొగ్గు చూపండి. Very Large Scale Integration (VLSI) సర్క్యూట్స్‌ నిత్యం వాడుకలో కంప్యూటర్‌, సెల్‌ఫోన్లు, అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించేది. దీన్ని ఇండస్ట్రియల్‌ అండ్‌ ఆటోమోటివ్‌ మైక్రో కంట్రోలర్లు, వైర్లెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కన్స్యూమర్‌ డిజిటల్‌ టీవీ ఇంకా హాండ్‌ హెల్డ్‌ డివైజెస్‌, కంప్యూటర్‌, స్టోరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లలో ఉపయోగిస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉండనే ఉన్నాయి.
ఉదాహరణకు డీఆర్‌డీవో, ఈసీఐఎల్‌, ఎన్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు; ఇంటెల్‌, సిమెన్స్‌, సిర్రుస్‌ లాజిక్‌- ఇలా ఎన్నో ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (2012) పూర్తి చేశాను. గేట్‌లో అర్హత సాధించాను. పీజీసెట్‌ ద్వారా మొబైల్‌ అండ్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఈ బ్రాంచిని అందిస్తున్న కళాశాలల వివరాలు తెలుపగలరు.

ఈ కింది కాలేజీల్లో మొబైల్‌, వైర్‌లెస్‌లో కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ కోర్సులు లభ్యమవుతాయి. జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఫర్‌ వుమెన్‌, షేక్‌పేట (http://www.gnits.ac.in/); సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఇబ్రహీంపట్నం (http://cvr.ac.in/home/); మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, దూలపల్లి (http://www.mrcet.com); వర్థమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, శంషాబాద్‌ (http://vardhaman.org/) హైటెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, గండిపేట (http://www.htech.ac.in/); లార్డ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హిమాయత్‌సాగర్‌ (http://www.lordsinstitute.in/).

వైర్‌లెస్‌ అండ్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ చదువుతున్నాను. ఈ కోర్సుకున్న అవకాశాల గురించి తెలుపగలరు.

వైర్‌లెస్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ రంగంలో వైర్‌లెస్‌ ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌/ స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరుగుతున్నందువల్ల ఈ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. ముఖ్యంగా మీరు మెసేజింగ్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ మేనేజర్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, టెలికమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌/ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌లో కెరియర్‌ను ఎంచుకోవచ్చు. 3జీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికే శాంసంగ్‌, హవాయి వంటి ఎన్నో కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం 2020 లక్ష్యం పెట్టుకుని ఇప్పటినుంచే ఆర్‌ అండ్‌ డీ పనులు మొదలుపెట్టాయి. భవిష్యత్తులో వైర్‌లెస్‌ అండ్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది.

2006లో బీటెక్‌ పూర్తిచేశాను. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారా సిస్టమ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. నెట్‌ వర్కింగ్‌లో ఆసక్తి ఉంది. ఇది నాకు ఉపయోగకరమేనా?

టెలి కమ్యూనికేషన్‌ రంగంలో చేస్తూ సిస్టం, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేయడం లాభదాయకమే. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, నెట్‌వర్కింగ్‌ టెలి కమ్యూనికేషన్‌ రంగం వారికి నెట్‌వర్కింగ్‌ గురించి అవగాహన ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే వీటికి మరొకదానితో అనుసంధానం ఉంది. కానీ మీరు ముందుగా ఒకదానిపై స్పెషలైజేషన్‌ కోసం దృష్టి పెట్టండి. http://www.spin.rice. edu/publications.html చూడండి.

ఎంసీఏ తర్వాత ఎంటెక్‌ (సీఎస్‌) చేశాను. యూజీసీ నెట్‌ రాయాలనుకుంటున్నాను. యూజీసీ కంప్యూటర్‌ వాళ్లకి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ సబ్జెక్టును మాత్రమే అందిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. నేను ఈ సబ్జెక్టులో యూజీసీ సర్టిఫికేషన్‌ పొందాలంటే ఎంసీఏతో దరఖాస్తు చేయాలా? లేక ఎంటెక్‌తోనా?

యూజీసీ నెట్‌ రాయడానికి మీరు ఎంసీఏ/ ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీకు ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌ పోస్టు సాధించడానికి ఉపయోగపడుతుంది. యూజీసీ నెట్‌లో కంప్యూటర్స్‌ సిలబస్‌ గురించి తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ని చూడండి. http://www.ugc.ac.in/net/syllabuspdf/87.pdf నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు http://ugcnetonline.in/ని అనుసరించండి.

ఎంఎస్సీ (సీఎస్‌) పూర్తిచేసి, ఎంటెక్‌ (సీఎస్సీ) చేస్తున్నాను. ఏఐసీటీఈ ప్రకారం ఇంజినీరింగు కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేయడానికి అర్హురాలినేనా? UGC NET లో అర్హత సాధిస్తే దేశంలోని ఇంజినీరింగు కళాశాలల్లో పనిచేయడానికి వీలవుతుందా?

UGC NETను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. దీనికి మాస్టర్‌ డిగ్రీలో 55శాతం ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. మీరు దీనికి ఎంటెక్‌ ద్వారా అప్త్లె చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.ugcnetonline.in/ వెబ్‌సైట్‌ను చూడండి. నెట్‌ రాస్తే ఉద్యోగం వస్తుందని కాదు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం సాధించడానికి కనీస అర్హత. ఇది సాధించిన తర్వాత ఆయా కళాశాలల వారు లెక్చరర్‌ పోస్టుల ఖాళీల గురించి ప్రకటన ఇస్తారు. దానికి దరఖాస్తు చేసుకుని వారు నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులై, ఉద్యోగం సంపాదించవచ్చు.

ఎంటెక్‌ పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో శిక్షణ, ఉద్యోగావకాశం అందించే కన్సల్టెన్సీల వివరాలు తెలుపగలరా?

ప్రతి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌కీ కనీసం C, C++ లో ప్రావీణ్యం ఉండవలసిందే. దీన్ని మీకుగా మీరు మెరుగుపరుచుకోవడానికి లింక్‌డిన్‌, ఇతర సామాజిక మాధ్యమాల సాంకేతిక ఫోరాలను అనుసరించండి.
ఇక వందశాతం ఉద్యోగాలు ఇప్పిస్తాం' అంటూ చాలా కన్సల్టెన్సీలు నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తుంటాయి. వాటిని నమ్మటం శ్రేయస్కరం కాదు. మిమ్మల్నీ, మీ ప్రతిభనూ నమ్ముకోండి. http://finance.groups.yahoo.com/ group/passion-n-career/ లాంటి గ్రూపుల్లో చేరితే ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో మీరు ఉచితంగానే తెలుసుకోగలరు. పత్రికల్లో వచ్చే అపాయింట్‌మెంట్స్‌ కాలమ్‌ క్రమం తప్పకుండా చూడటం అలవాటు చేసుకోవాలి. ఇంకా గతంలో ఈ శీర్షికలో తెలిపినవిధంగా గూగుల్‌ అలర్ట్స్‌ను కూడా వినియోగించుకోండి.

ఎం.టెక్‌ పూర్తిచేసిన తర్వాత ఒక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రాజెక్టుల్లో చేయాలని ఉంటుంది. కానీ వరంగల్‌ వదిలిరాలేని పరిస్థితులు. ఇంటి నుంచే పనిచేసుకునేలా సదుపాయం కల్పించే కంపెనీలు ఏమైనా ఉన్నాయా చెప్పండి.

కొన్ని చిన్న, మధ్యతరగతి కంపెనీలు ఎక్కువ ఉద్యోగులను పెట్టుకోకుండా వాళ్ల ప్రాజెక్టు పనులను బయటివారికి ఇచ్చి చేయిస్తూ ఉంటాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా అలాంటి సంస్థలకు పనిచేయవచ్చు. గురు.కామ్‌, ఇలాన్స్‌.కామ్‌ లాంటి వెబ్‌సైట్స్‌ ద్వారా కూడా ఏ కంపెనీ ఎలాంటి ప్రాజెక్టులకు ఫ్రీలాన్సర్ల కోసం వెతుకుతున్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా మీరు మీ నైపుణ్యాలనూ, నమూనాల (శాంపుల్స్‌)నూ బ్లాగు ద్వారా తెలియజేస్తూ ఆయా కంపెనీలను సంప్రదించి ప్రాజెక్టు పొందవచ్చు. కానీ డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఇంటి నుంచే పనిచేసుకోవచ్చని చెప్తూ లేని ప్రాజెక్టులను పుట్టించే వాళ్ళుంటారు. మోసపోవద్దు.

ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాను. యూజీసీ నెట్‌కి సంబంధించిన వివరాలు తెలపండి.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వాళ్లు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ను సంవత్సరానికి రెండు సార్లు దేశమంతటా నిర్వహిస్తారు. మార్చి, సెప్టెంబరు నెలల్లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్ష ఉంటుంది. దీనికి మీకు మాస్టర్స్‌లో 55 శాతం ఉండి ఉండాలి. నెట్‌లో పాస్‌ అయినవాళ్లు లెక్చరర్‌షిప్‌ కి అర్హులు. అనగా వాళ్లు ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజీలలో లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తోడు ఫెలోషిప్‌ అర్హత సంపాదిస్తారు. రెండు సంవత్సరాల కాల పరిధి ఉంటుంది. నెట్‌ సిలబస్‌ కోసం ఈ వెబ్‌లింక్‌ చూడగలరు.
http://www.ugc.ac.in/net/syllabuspdf/87.pdf.నోటిఫికేషన్‌, పరీక్షాపద్ధతి, ఫీజు, ఇతర వివరాలకు ఈ వెబ్‌సైట్‌ని చూడగలరు. http://ugcnetonline.in/.

B.Tech.-ECC 2011లో పూర్తి చేశాను. ఇపుడు ప్రాజెక్టు ఇంజినీర్‌గా energy efficiencyకంపెనీలో పనిచేస్తున్నాను. ఎంటెక్‌ చేసి కోర్‌ ఇంజినీరింగ్‌ వైపే ఉండాలని అనుకుంటున్నాను. ఎంటెక్‌లో control systemsబ్రాంచి ఎంచుకున్నాను. ఇలా వెళ్లడం మంచిదేనా? నాకు పీజీ తర్వాత ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో చెప్పండి.

కేవలం మాస్టర్స్‌ చేయడం వల్ల ఉపయోగం లేదు. మీరు Master + Ph.D లాంటి పోగ్రామ్స్‌ చేయండి. ఇప్పటికే energy efficiencyలో పనిచేస్తున్నారు కాబట్టి Energy Audit Expertగా ముందుకు వెళ్లడానికిLEEDసర్టిఫికేషన్‌ కోర్సులు http://www.em-ea.org/ని చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.Control Systems లోABB, Siemens లాంటివి ఉండనే ఉన్నాయి. అనుభవంతో మెరుగుపరుచుకునే నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు వస్తాయి.

Pages