వ్యవసాయ విద్య - WWW.JOBKAVALI.TK

If you are searching for any freshers vacancy or job search portal, then we have a list to help you out

Breaking

ఏపీ డీఎస్సీ ప్రత్యేకం ఏపీ ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఏపీపీఎస్‌సీ హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ 309 ఏఈఈలు 24 ఎఫ్ఆర్వోలు 23 ఏఎంవీఐలు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు కెన‌రా బ్యాంకులో 800 పీవోలు ఏపీలో పోలీసు ఉద్యోగాలు: 2723 కానిస్టేబుళ్లు 334 ఎస్ఐలు న్యూఇండియా అస్యూరెన్స్‌లో 312 ఏవోలు ఐబీపీఎస్‌లో 1599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్లు ఐబీలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు

ads

మీకోసమే... ఈ పోర్టల్



పదో తరగతిలో మంచి మార్కులు రావాలి.

ఇంటర్మీడియట్ లో ఇష్టమైన ర్యాంకు కావాలి.

ఎంసెట్ తో ఎంచుకున్న సీటు కొట్టాలి.

ఇవన్నీ జరగాలంటే ... మంచి గైడెన్స్ కావాలి.

నాణ్యమైన మెటీరియల్ కావాలి.

అందుకు నమ్మకమైన మార్గదర్శి కావాలి.

అలాంటి ఆన్ లైన్ మాస్టారు... ఈనాడు ప్రతిభ.నెట్

టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉన్న కొండంత సిలబస్ నుంచి

అర్థంకాని అంశాలను వివరించి... విశ్లేషించే పాఠ్యభాగాలు.

సంవత్సరాంత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహకరించేందుకు నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు.

ప్రతిపాఠం నుంచి ముఖ్యమైన బిట్లు, పాఠంపై అవగాహనను

అంచనావేసుకోవడానికి స్వీయపరీక్షలు అందించే

ప్రతి ఇంట పాఠశాల... ఈనాడు ప్రతిభ.నెట్

తర్వాత...

డిగ్రీలో ఏం చదవాలి? డిగ్రీ కాకుండా ఏం చేయాలి?

వృత్తి విద్యకు దారులెన్ని? ఉన్నత విద్యకున్న మార్గాలేమిటి?

ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయి? ఏయే పోటీ పరీక్షలున్నాయి?

వాటికోసం ఏమేం చదవాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?

ఎలా చదవాలి? ఏ క్రమంలో చదవాలి?

ఇన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలను అందిస్తుంది.... ఈనాడు ప్రతిభ.నెట్

ఎంతచదివినా...

ప్రశ్నలు ఎలా వస్తాయో?

పేపర్ ఎలా ఉంటుందో?

మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?

మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?

అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేస్తోంది ఈనాడు ప్రతిభ .నెట్.

ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.

అన్నింటినీ ఒకే చోట అందించే ఫలితాలు.

ఉన్నత విద్యకోసం వెలువడే నోటిఫికేషన్లు....

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు....

స్కాలర్ షిప్ లు... ఫెలోషిప్ ల వివరాలు...

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించి

ఉన్నతస్థాయికి చేరేందుకు సహకరించే 'సాఫ్ట్ స్కిల్స్'.

ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే సందేహాలకు

సమాధానాలను ఇచ్చే నిపుణుల వేదిక ఆస్క్ ది ఎక్స్ పర్ట్!

ఇలా అన్నిరకాలుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అండగా ఉండే

విద్యాఉద్యోగాల సమగ్ర సమాచార సమాహారం ఈనాడు ప్రతిభ.నెట్.

మీమీ లక్ష్యాల సాధనలో అన్నివేళల ఆన్ లైన్ లో తోడుంటుంది.

అందరికీ ఆల్ ద బెస్ట్.!



కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
కొత్త సంవత్సరంలో కొలువు పట్టేయండి
కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా..
read more-->
మాయ చేయొద్దు..! దొరికిపోతారు!
ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే..
read more-->
'నూతన' మార్గం సిద్ధం చేసుకోండి!
మరో రెండు వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. పైగా 2015లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం వెదుకుతున్న వారు ఎక్కువ మంది..
read more-->
లక్ష్యాలు నిర్దేశించుకోండి!
కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు.
read more-->
వీడియో ఇంటర్వ్యూ ఇలా విజయవంతం
హైదరాబాద్‌లో ఉంటున్న సత్య ఢిల్లీకి చెందిన కంపెనీలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అతని అర్హతలు, నైపుణ్యాలు రిక్రూటర్లకు నచ్చాయి. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి సంబంధించిన కబురు పంపారు. మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.
read more-->
ఒక్కో కొలువుకు ఒక్కో విధంగా
రవి ఇప్పటికే ఒక సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగ అనుభవం ఉంది. దీంతో తన అనుభవం అర్హతలకు తగినట్లు ఎప్పటికప్పుడు రెజ్యూమెను తాజా పరచుకొంటూ ఉన్నాడు. అర్హతలకు తగిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
read more-->
పట్టా కాదు పట్టూ ఉండాలి
మరికొద్ది రోజుల్లో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో కొంత మంది, ''నాకు అన్నీ తెలుసు కనుక ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు..'' అనుకుంటారు. మరికొందరేమో అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన లేక మిన్నకుండిపోతారు.
read more-->
శె'భాస్‌' అనిపించుకోవాలంటే..!
ఉద్యోగంలో చేరి ఏళ్లు గడిచిపోయాయి. గతంతో పోల్చితే బాగా పని చేయడం లేదని బాస్‌ వ్యాఖ్యలు. బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నా.. సమీక్ష వద్దకు వచ్చేసరికి ఆశించిన మార్కులు లేదా గ్రేడ్‌ రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు..!
read more-->
ఆ విషయం గుర్తుందా!
ఉద్యోగాల కోసం పత్రికలు, ఇతర ప్రకటనలతో పాటు.. ఆన్‌లైన్‌లోనూ వెదికేవారి సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి వ్యక్తీ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ ఫలించాలంటే.. కాస్త నేర్పుగా వ్యవహరించాలి.
read more-->
'స్మార్ట్‌'గా అన్వేషిద్దాం
రోజులు మారాయి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రస్తుతం అరచేతిలో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఆన్‌లైన్‌, ఇతర వేదికలపై ప్రకటనలకు తోడు విస్తృతంగా మొబైల్‌ యాప్స్‌ కూడా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.
read more-->
దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం
ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో..
read more-->
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగికీ ఇల్లు.. కార్యాలయం తేడా లేదు. కార్యాలయంలో ఏ పనులు చేస్తారో అవన్నీ ఇంట్లో కూడా చేసుకొనేలా సకల వసతులూ సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో వృత్తి రీత్యా అటు సంస్థకు..
read more-->
శిక్షణకాలంలోనే సాధించాలి
విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే.
read more-->
ప్రత్యేక లక్షణాలుంటేనే..!
ఒక ఉద్యోగానికి పది మంది దరఖాస్తు చేశారు. అందరిలోనూ సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు ఉన్నాయి. కాని సదరు సంస్థకు కావాల్సింది మాత్రం ఒక్కరే. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి సంస్థలోనూ నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే సంస్థలు అర్హతలు, నైపుణ్యాలు, ప్రతిభలతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను..
read more-->
అలా నింపితే చాలదు
ఉద్యోగ అన్వేషణలో తొలి దశ దరఖాస్తు నింపడం. ఏ ఉద్యోగానికైనా ఇది తప్పనిసరి ప్రక్రియ. దీని తర్వాతే పరీక్షలు, ఫోన్‌ ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, ముఖాముఖీలు. ఈ తొలిదశలో పక్కాగా వ్యవహరిస్తేనే కొలువు సాకారమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువ మంది అప్లికేషన్‌ను నింపే విధానం సరిగ్గా తెలియక..
read more-->
సాధారణ డిగ్రీతోనూ మంచి కొలువులు
సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ రోజుల్లో ఏం ఉద్యోగాలు వస్తాయి.. అనుకుంటూ నిరాశపడవద్దు. మారుతున్న కాలానికి తగినట్లు సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంచుకున్న రంగంలో పట్టు,
read more-->
పోస్ట్‌తో జాగ్రత్త!
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌..
ట్విటర్లో ఓ కామెంట్‌..
గూగుల్‌ ప్లస్‌లో ఓ ఫొటో ..
ఇవి ఏవైనా సరే.. మీ కలల ఉద్యోగానికి ఎసరుపెట్టవచ్చు. దాదాపు ఖాయమైన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు.
read more-->
ముందు అధ్యయనం చేయండి
ఇంటర్వ్యూ.. ఉద్యోగ సాధనలో చివరి దశ. ఇక్కడ నెగ్గితే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. అందువల్ల ఏ ఉద్యోగమైనా సరే.. మౌఖిక పరీక్ష చాలా కీలకం. రాతపరీక్ష.. ఇతర అంశాలతో పోల్చితే మౌఖిక పరీక్ష ఎక్కువ కష్టంగా ఉండదు. కాని విజయవంతమయ్యేది మాత్రం కొందరే.
read more-->
నేరుగా మాట్లాడేది 60 శాతమే
కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం.
read more-->
కొలువొచ్చిన కొత్తలో..
వృత్తిగత జీవితంలో ప్రతి క్షణమూ కీలకం. వృత్తిపరంగా నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటుపడుతూ ముందుకు వెళ్లడమే మంచి ఉద్యోగి లక్షణం. ముఖ్యంగా వృత్తిజీవితంలో సకాలంలో అభివృద్ధిని,
read more-->
కొలువులో ఖుషీ
ఉద్యోగులంతా మనస్ఫూర్తిగానే పని చేస్తున్నారా?చేస్తున్న పనిలో అందరికీ సంతృప్తి లభిస్తోందా?పనిని ఆస్వాదించే వారు ఎందరు?ఉద్యోగాన్ని భారంగా భావిస్తున్న వారు ఎవరు?కార్యాలయంలో ఎవరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
read more-->
విజేతల తీరే వేరు
సహోద్యోగో.. సహచరుడో.. గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఆయన అదృష్టం బాగుంది. అందువల్లే ఆయనకు ఆ విజయం దక్కిందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
read more-->

అవాస్తవాలు వద్దు
రెజ్యూమె.. ఇది మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మీ ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు, అనుభవానికి దర్పణం. ఉద్యోగ అన్వేషణలో చాలా కీలకం. అయినా కొంత మంది రెజ్యూమెలో అవాస్తవాలు ప్రస్తావించి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.
read more-->

ఐటీ అంటే కోడింగ్‌ ఒక్కటే కాదు
ఐటీ.. ఈ పేరు వింటే చాలు.. ఇది ప్రోగ్రామింగ్‌.. కోడింగ్‌లకు మాత్రమే సంబంధించిందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమలో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కీలకమే. ఇవే కాకుండా ఇతరత్రా ఉద్యోగాలూ ఇక్కడ ఉంటాయి.
read more-->

ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
వృత్తి జీవితంలో అడుగుపెట్టాలన్న వారికి మార్కెట్‌లో అనేక అవకాశాలు కన్పిస్తుంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలి... ఆయా రంగాల్లో అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై పలు రకాలుగా సందేహాలు వస్తుంటాయి.
read more-->

చూడగానే ఆకట్టుకోవాలి
రెజ్యూమె.. దీన్ని రూపొందించడం ఒక కళ. మీ రెజ్యూమె మీకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. అలా కాకుండా నెట్‌లోనో.. లేక మరెక్కడో చూసో.. ఇతరుల సాయంతోనో దీన్ని ఏదో ఒకలాగా రూపొందిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి.
read more-->

ఇంటర్న్‌షిప్‌పై దృష్టి సారించండి
ప్రముఖ సంస్థలు ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కోసం సాధారణంగా సంస్థలు క్యాంపస్‌ల నుంచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంటాయి. శిక్షణ పూర్తయ్యే సరికి సంస్థలో పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోగలరా అనే కోణంలో పరిశీలించి మరీ ఎంపిక చేస్తారు.
read more-->

క్లయింట్లను కట్టిపడేసే వారికే కొలువులు
పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అధికంగా ఉన్నవారి వైపే సంస్థలు చూస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉండడమేకాదు ఉన్నతస్థానాలకూ త్వరగా చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు. సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు చేయడంతోనే మనుగడ సాధించలేదు.
read more-->

ఉందిలే మంచికాలం
ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నవారికి ఈ ఏడాది కలిసివచ్చేలా ఉంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచేందుకు ఎక్కువ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. హెడ్‌హోంకోస్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 84.1 శాతం సంస్థలు ఈ ఏడాది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.
read more-->

అన్వేషణ మారింది!
ప్రతిభ, నైపుణ్యాలకు తగినట్లు ఆయా రంగాలపై అవగాహన.. కొత్తగా చోటు చేసుకొంటున్న మార్పులను గుర్తిస్తే చాలు ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున నియామకాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో..
read more-->

అంకిత భావం పెరుగుతోంది..!
అంకిత భావం.. ఆసక్తి.. ఈ రెండూ చాలు ఉద్యోగంలో రాణించడానికి. ప్రస్తుతం దేశంలోని ఉద్యోగుల్లో క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు ఉద్యోగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు.. సంస్థ పట్ల అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ మేరకు కెల్లీ గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.
read more-->

భవిష్యత్‌.. ఇక సుస్థిరం
అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాల జపం పఠించిన భాజపాకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతోంది. యువతకు ఉపాధి.. ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని కానున్న మోడీ చెబుతున్నారు.
read more-->

గ్రాఫ్‌ పడనీయొద్దు..!
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తుంటారు. కార్యాలయంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూనే ఉంటారు. ఇందుకోసం సకాలంలో లక్ష్యాలు చేరుకోవడం.. బాస్‌ అప్పగించిన అదనపు బాధ్యతలు సక్రమంగా చేపట్టడం వంటివి చేయడంతోపాటు సీనియర్ల సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
read more-->

గుర్తిస్తేనే.. అధిక ప్రయోజనం
సంస్థలు ఉద్యోగుల్లో ప్రతిభను కాస్త గుర్తించి ప్రోత్సహిస్తే చాలు.. సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామంటున్నారు భారత ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలతో పోల్చితే ఈ ధోరణి మన దేశంలో ఎక్కువగా ఉంది. సంస్థలు ఉద్యోగుల ఆలోచనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. .

read more-->

డిజిటల్‌ యువతదే భవిత
పుస్తకాలతో కుస్తీ పట్టి మౌఖిక పరీక్షలకు గజినీలా దండయాత్రలు చేస్తేనే కానీ వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడం సాధ్యమయ్యేది కాదు.. నాటి తరం పరిస్థితి ఇది.. మరి నేటి తరం వారిదో.. ఇంటి దగ్గరే కూర్చొని సామాజిక వేదికల్లో రెజ్యూమెను అప్‌డేట్‌ చేసి రిక్రూటర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా అభివృద్ధి చెందిన సాంకేతికత పుణ్యమైతే.. దాన్ని అందిపుచ్చుకొని దూసుకెళ్తోంది మిలీనియం జనరేషన్‌.
read more-->

జాబుదొంగలతో.. జాగ్రత్త!
చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది ఓ యువతి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమె రైలు దిగిందో లేదో.. ఆమెకు ఆర్బీఐ ఉద్యోగి తారసపడ్డాడు. అతను తన గుర్తింపు కార్డు చూపి.. తాను ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికాడు. చేతిలో ఉన్న నకిలీ దరఖాస్తులు ఇచ్చి వాటిని నింపమని కోరాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
read more-->

పదోన్నతిపై సందేహాలా!
ఉద్యోగ అన్వేషణలో ఇంటర్వ్యూ దశ కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. దాదాపు కొలువు సాకారమైనట్టే. అయితే ఈ దశ ఎంత కీలకమో.. దీన్ని విజయవంతంగా అధిగమించడం అంతే కష్టం. అన్ని ఉద్యోగాలకూ పోటీ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అసాధారణ ప్రతిభను.. నైపుణ్యాలను..
read more-->

కొలువుంది.. కానీ
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి శుభవార్త. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధ (ఫార్మాస్యూటికల్‌) రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌..
read more-->

పదోన్నతిపై సందేహాలా!
పదోన్నతి... వృత్తి జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి లక్ష్యమూ ఇదే. కెరియర్‌లో దూసుకెళ్లాలని, సకాలంలో పదోన్నతులు పొంది ఉన్నతస్థానాలకు వేగంగా చేరాలని భావిస్తుంటారు. మీలోని నైపుణ్యాలు, సామర్థ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే ఏమీ ఆశించకుండానే నలుగురిలోనూ గుర్తింపు పొందుతారు.
read more-->

కొలువులున్నాయి కానీ!
ఒకపక్క బోలెడు ఉద్యోగ అవకాశాలు. సరిపడా నిపుణులు లేక ప్రతిభావంతుల కోసం సంస్థల గాలింపు.మరోపక్క సరైన ఉద్యోగం లేక మంచి కొలువు కోసం యువత అన్వేషణ.ఇదీ కొన్నేళ్లుగా దేశంలో వింత పరిస్థితి.
read more-->

దృష్టి సారిస్తున్నారా...!
కార్యాలయంలో అన్ని వేళలా పని మీద దృష్టి సారించడం కష్టసాధ్యమే. సహచరులతో పిచ్చాపాటీ, స్నేహితుల ఫోన్లతో పూర్తి స్థాయి సమయాన్ని పనికి కేటాయించని వారికీ కొదవలేదు. ఎంత దృష్టి పెట్టాలన్న ఏదో ఒక సందర్భంలో దృష్టి మరల్చడం తప్పదు.
read more-->

ఇంటర్వ్యూ అయ్యాక..!
ఉద్యోగ సాధనలో కీలక దశ ఇంటర్వ్యూ. ఈ దశకు చేరుకోవడం ఎంత కష్టమో.. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అంతే కష్టం. ముఖాముఖి పరీక్షలో విజయం సాధించినా తర్వాత కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది.
read more-->

సమష్టితత్వంతోనే గెలుపు
మీరు ఓ ప్రాజెక్టులో బృంద సభ్యుడు. అన్ని బాధ్యతలు ప్రాజెక్టు మేనేజరు చూసుకుంటారు.. మనకు అప్పగించిన పని చేసుకుంటే చాలు అనుకోవడం పొరపాటు.
read more-->

నైపుణ్యాలపై గురి పెట్టండి
పట్టభద్రులు ఉన్నత విద్యలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెట్టొచ్చని భావించడం సరికాదు.
read more-->

వివరంగా తెలుసుకోండి
ఉద్యోగ ప్రకటనల్లో ఉద్యోగ వివరణ లేకున్నా.. సరిగ్గా అర్థం కాకున్నా సదరు ప్రకటన విడుదల చేసిన సంస్థకు ఫోన్‌ చేసో లేదా మెయిల్‌ ద్వారానో ఉద్యోగ వివరణను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీ ప్రయత్నాలు వృథా ప్రయాస అవుతాయి.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నారా..!
read more-->

అందిపుచ్చుకోండి
ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దేశంలో డిమాండు పెరిగిందని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఏటేటా ఆ సంఖ్య తగ్గుతోంది. 2012లో 5.52లక్షల ప్రారంభ స్థాయి ఉద్యోగాల కల్పన జరిగితే 2013లో ఆ సంఖ్య 5.5 లక్షలకు తగ్గింది.
read more-->

ఈ ప్రత్యేకతలున్నాయా?
గెలుపు అందని ద్రాక్ష కాదు. అందుకోవాలంటే కాస్త కష్టపడాలంతే. ఈ కష్టానికి తోడు మరికొన్ని మంచి లక్షణాలు తోడైతే విజయాన్ని సాధించడం మరింత సులభమవుతుంది. ఈ లక్షణాల్లో కొన్ని స్వభావ రీత్యా వస్తే.. మరికొన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, కష్టపడేతత్వం అన్నీ ప్రస్తుతం అందరిలోనూ ఉంటున్నాయి. దీంతో గెలవాలంటే మరిన్ని అదనపు లక్షణాలను వంట బట్టించుకోవాలి. ఆ లక్షణాలేంటో చూడండి మరి..!
read more-->

ఇకనైనా ప్రేమించడం మొదలుపెట్టండి
మీకు ఉద్యోగం రోజూ బోర్‌ కొడుతోందా..! అయితే ఒకసారి సానుకూలంగా ఆలోచించండి. పనిని ప్రేమించడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టమే. అయినా సరే ఒక్కసారి మీరు పనిని ప్రేమించడం మొదలుపెడితే ఇక జీవితంలో మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పనిని ప్రేమించాక అసలు మీకది ఉద్యోగంలాగానే అనిపించదు. మీరు ఆ ఉద్యోగాన్ని బాగా ఆస్వాదిస్తారు. దీంతో మీ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పదోన్నతులు..
read more-->

భావాల్ని పలికించండిలా!
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు.
read more-->

గడువు తప్పొద్దు
ఎంత ప్రతిభ ఉన్నా.. ఎంత బాగా పని చేసినా.. గడువులోపు పనిని పూర్తిచేయకుంటే అన్నీ వృథా అవుతాయి. కనుక వృత్తిలో సకాలంలో పని పూర్తి చేయడం కీలకం. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా గడువు తప్పే ప్రమాదం ఉంటుంది. తరచూ ఇలా చేస్తే.. మీపై సంస్థకు విశ్వాసం సన్నగిల్లుతుంది. గొప్ప అవకాశాలూ తగ్గిపోతాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12

Thursday

వ్యవసాయ విద్య

వ్యవసాయ విద్య

వన్నె తరగని వ్యవసాయ విద్య!
వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిష'న్‌ను నియమించింది. ఈ కమిషన్ అమెరికాలోని లాండ్ గ్రాంట్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్‌లో (ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లా) ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్, హైదరాబాద్) వ్యవసాయ విద్యను అందిస్తోంది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్యాన విద్యను, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (తిరుపతి) పశువైద్య విద్యను అందిస్తున్నాయి.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఉద్యాన రంగాల సర్వతోముఖాభివృద్ధికి 1964లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1996లో దీన్ని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. వ్యవసాయ కోర్సుల నిర్వహణలో పేరుగాంచిన ఈ వర్సిటీ అందిస్తున్న వ్యవసాయ సంబంధిత కోర్సుల వివరాలు...
1. బీయస్సీ (అగ్రికల్చర్) - (అర్హత: ఇంటర్ బైపీసీ).2. బీయస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్- (అర్హత: ఇంటర్ బైపీసీ/ ఎంపీసీ).3. బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - (అర్హత: ఇంటర్ ఎంపీసీ).4. బీటెక్ (ఫుడ్ సైన్స్)- (అర్హత: ఇంటర్ బైపీసీ/ఎంపీసీ).5. బీయస్సీ (ఆనర్స్) హోమ్ సైన్స్ - (అర్హత: ఇంటర్ బైపీసీ)6. బి.యస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ - (అర్హత: ఇంటర్ బైపీసీ)7. బి.యస్సీ (ఆనర్స్) ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ - (అర్హత: ఇంటర్ బైపీసీ).
ఈ కోర్సుల కాలవ్యవధి 4 సంవత్సరాలు.
ప్రవేశ విధానం: బీయస్సీ (ఆనర్స్) హోమ్‌సైన్స్, బీయస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ, బీయస్సీ (ఆనర్స్), ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు మినహాయించి మిగిలిన బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ ర్యాంకు తప్పనిసరి. హోమ్‌సైన్స్ విభాగంలోని కోర్సుల్లోకి కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ ప్రకటన ప్రత్యేకంగా విడుదల అవుతుంది.
వర్సిటీ పరిధిలోని కళాశాలలు
* వ్యవసాయ కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, బాపట్ల, మహానంది (కర్నూలు), అశ్వరావుపేట (ఖమ్మం), వైరా (శ్రీకాకుళం), రాజమండ్రి, జగిత్యాల.* వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు - బాపట్ల (గుంటూరు జిల్లా), మడకశిర (అనంతపురం), సంగారెడ్డి (మెదక్).* ఫుడ్ సైన్స్ కళాశాలలు - బాపట్ల (గుంటూరు జిల్లా), పులివెందుల (కడప).* హోమ్‌సైన్స్ - గృహవిజ్ఞాన కళాశాల (సైఫాబాదు, హైదరాబాదు.)
ఉపాధి అవకాశాలు: వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు, వ్యవసాయ అభివృద్ధి నిర్వహణ సంస్థలు వ్యవసాయ అధికారులుగా, పర్యవేక్షక నిపుణులుగా అవకాశాలు కల్పిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహకార సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయి. విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మంజూరుకు, బీమా సంస్థల్లో వ్యవసాయ విషయనిపుణులుగా మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. అగ్రి క్లినిక్స్ ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటోంది.
వెబ్‌సైట్: http://www.angrau.ac.in
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం 
వ్యవసాయంతోపాటు ఉద్యాన రంగానికి కూడా ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కూరగాయల సాగు, పండ్లతోటలు, పూలు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, ఉద్యానవనాల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. ఈ రంగాల్లో అవసరమైన నిపుణులను అందించేందుకు 2007లో డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
వర్సిటీ అందిస్తున్న కోర్సు: బీయస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్ (అర్హత: ఇంటర్ బైపీసీ).
వ్యవధి: నాలుగు సంవత్సరాలు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
చిరునామా: డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.
వెబ్‌సెట్: www.drysrhu.edu.in
తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన కాలేజీలు: రాజేంద్రనగర్ (హైదరాబాద్), వెంకట రామన్నగూడెం (పశ్చిమ గోదావరి), మోజెర్ల, (కొత్తకోట, మహబూబ్‌నగర్), అనంతరాజుపేట (వై.ఎస్.ఆర్. కడప).
ఉపాధి అవకాశాలు: ఉద్యాన విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖలో హార్టీకల్చర్ ఆఫీసర్లుగా ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విత్తన కంపెనీలు ఉద్యానవనాలకు కన్సల్టెంట్లుగా వీరినే నియమిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో.....
దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం సీట్లు, కర్నాల్‌లో ఉన్న నేషనల్ డెయిరీ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో 100 శాతం సీట్లను భర్తీ చేయడానికి న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనామండలి ఏటా అఖిల భారత స్థాయిలో ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. ఈ మండలి నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా చేరదగిన డిగ్రీ కోర్సులు..బీఎస్సీ (బీటెక్ /బీఎఫ్‌సీ)
సబ్జెక్టులు: అగ్రికల్చర్, హార్టీకల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, హోమ్‌సైన్స్, సెరికల్చర్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
వీటిలో చేరేందుకు ఇంటర్‌లో (బైపీసీ) కనీసం 60 శాతం మార్కులు అవసరం. వయసు 17 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
చిరునామా: ఎగ్జామినేషన్ సెల్, ఎడ్యుకేషన్ డివిజన్
భారత వ్యవసాయ పరిశోధనా మండలి
కృషి అనుసంధాన్ భవన్, పూసా, న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.icar.org

ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు
* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - బెంగళూర్* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - ధార్వాడ్* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - రాయచూర్* యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చరల్ సైన్సెస్ - నాగనగర్, భాగల్‌కోట్* తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ - కోయంబత్తూర్* తమిళనాడు వెటర్నరీ యానిమల్ సైన్స్‌వర్సిటీ - చెన్నై* డాక్టర్ బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ - రత్నగిరి, మహారాష్ట్ర* డాక్టర్ పంజాబీరావ్ దేశ్‌ముఖ్ కృషీ విద్యాపీఠ్ - అకోలా, మహారాష్ట్ర* మహాత్మా పూలె కృషీ విద్యాపీఠ్ - రాహౌరి, మహారాష్ట్ర* మరట్వాడ అగ్రికల్చర్ వర్సిటీ - పర్భణి, మహారాష్ట్ర* కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ - త్రిసూర్* బెనారస్ హిందు యూనివర్సిటీ - వారణాసి* కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం - ఇంఫాల్
* హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ - హిస్సార్.
* జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ - పంత్‌నగర్.

ప్రవేశం: జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించి ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటిలో 15 శాతం సీట్లను భారత వ్యవసాయ పరిశోధనా మండలి నిర్వహించే ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా భర్తీచేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు.
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
పాడి, పౌల్ట్రీ పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం లాంటి వాటితో పశుసంవర్ధక రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ఈ రంగం పురోగతి కోసం అవసరమైన నిపుణులను అందించేందుకు ప్రభుత్వం 2006లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సంస్థ అందిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు...1. బీవీఎస్సీ అండ్ ఎ.హెచ్. - (5 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ బైపీసీ).2. బీఎఫ్ఎస్సీ- (4 ఏళ్లు, అర్హత: ఇంటర్ బైపీసీ).3. బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)- (4 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ ఎంపీసీ).
ఎంపిక: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా.

వర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలలు
*
 పశువైద్య కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, గన్నవరం, విజయవాడ, ప్రొద్దుటూరు (కడప), కోరుట్ల (కరీంనగర్).* మత్స్య కళాశాల - ముత్తుకూరు, (నెల్లూరు).* డెయిరీటెక్నాలజీ-కామారెడ్డి(నిజామాబాద్), తిరుపతి.ఉపాధి అవకాశాలు: వెటర్నరీ సైన్స్ (పశు వైద్యం) చదివిన విద్యార్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్ర పశు సంవర్థక శాఖలో పశువైద్యులుగా చేరవచ్చు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, పశువులకు వచ్చేవ్యాధుల నివారణకు ఉపయోగించే ఔషధాలను తయారు చేసే కంపెనీలు తదితర సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.svvu.edu.in

భవిష్యత్తుకు తిరుగులేదు!
వ్యవసాయ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఆచార్య రంగా వర్సిటీలో పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫైనల్ ఇయర్ చివర్లో ఆయా కళాశాలల్లో ఉన్న ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, విత్తన కంపెనీలు తదితర సంస్థల్లో ఉపాధి లభిస్తోంది.

Pages